ETV Bharat / state

అకాల వర్షంతో రాష్ట్రంలో అల్లకల్లోలం - వందల ఎకరాల్లో దెబ్బతిన్న పసుపు, మొక్కజొన్న పంటలు - Unseasonal Rains in AP - UNSEASONAL RAINS IN AP

Unseasonal Rains in AP : వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. భానుడి భగభగల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించినా మామిడి, పసుపు, మొక్కజొన్న రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భారీ ఈదురుగాలులకు మామిడి కాయలు నేలరాలాయి. వందల ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి

unseasonal_rains
unseasonal_rains (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 9:09 AM IST

అనూహ్య వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం - వందల ఎకరాల్లో దెబ్బతిన్న పసుపు, మొక్కజొన్న పంటలు (ETV Bharat)

Unseasonal Rains in AP : భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్న వేళ మంగళవారం కురిసిన వర్షం రాష్ట్ర ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే ఈ అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ ఈదురుగాలులకు మామిడి పంట నేలరాలింది. వందల ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వర్షపు నీరు ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Krishna District : ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఉమ్మడి కృష్ణాజిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మైలవరం, నూజివీడు, ఆగిరిపల్లి ప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి మండలాల్లో ఒక్కసారిగా వాతావరణం మారడంతో వందలాది ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న ఆరబెట్టిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రెయిన్​ అలర్ట్​- నాలుగు రోజుల పాటు కూల్​ వెదర్​ - Rain Alert In Andhra Pradesh

Nandhyala District : నంద్యాల జిల్లా కరివేన గ్రామంలో కురిసిన వర్షానికి వాన నీరు ఇళ్లల్లోకి చేరింది. నీరు వెళ్లేందుకు కాలువ తీసే విషయంలో పొరుగు వారితో జరిగిన ఘర్షణలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. ఆత్మకూరు మండలం ముష్టేపల్లిలో వడగళ్ల వాన పడటంతో చెట్లపైన ఉన్న పక్షులు కిందపడి ఇబ్బందిపడ్డాయి. గాలివాన బీభత్సంతో పశువుల పాకలు, రేకుల షెడ్లు విరిగిపడిపోయాయి. అనంతపురంలో కురిసిన చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మండిపడ్డారు. 1100 కోట్లతో నగర అభివృద్ధి చేశామన్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మాటలు తప్ప అభివృద్ధి చేసిందేమి లేదని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వస్తే మూడు నెలల్లో నగర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నీళ్లలోనే రాకపోకలు సాగిస్తున్న వాహనదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో తారాస్థాయికి చేరుకున్న ఉష్ణోగ్రతలు - రాబోయే 2 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు - Temperatures Raising Extreme

Konaseema District : అకాల వర్షంతో కోనసీమ జిల్లా రైతులు అవస్థలు పడ్డారు. కల్లాల్లో ఉన్న ధాన్యం కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. రాజమహేంద్రవరంలో కుంభవృష్టి కురవడంతో వర్షం నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. సుమారు రెండు గంటలపాటు కురిసిన వానతో నగరంలోని రహదారులపై వర్షపు నీరు పొంగిపొర్లింది. ఈదురుగాలుల తీవ్రతకు ఇంటర్నెట్ , విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Rain Alert : తూర్పు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి అవరించి ఉంది. దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ వెల్లడించింది. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు- 40డిగ్రీలు దాటొచ్చని వాతావరణశాఖ అంచనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.