Unknown Persons Gun Attack With TDP Leader: అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ఒంటిల్లు గ్రామానికి చెందిన గిరినాయుడు అనే టీడీపీ నేతపై గుర్తు తెలియని దుండగులు తుపాకులతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. తన కుమారుడి జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు గిరినాయుడి ఇంట్లోకి చొరబడ్డారు. వెంటనే తన భార్య దుండగులను చూసి కేకలు వేశారు.
వాళ్ల దగ్గరున్న తుపాకులతో బెదిరించిన దుండగులు అతని భార్య, తండ్రిని కొట్టి గాయపరిచారు. అరుపులు విని ఇంట్లోకి వచ్చిన గిరినాయుడిపై వాళ్లు నాటు తుపాకీతో హత్యాయత్నం చేశారు. గిరినాయుడు వారిని వెంబడించగా ఆర్టీసీ బస్టాండు వద్దకు వచ్చేసరికి తప్పించుకున్నారని అతను తెలిపారు. దీంతో గిరి నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరశీలించారు.
తిరుపతిలో దారుణం - దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి - వృద్ధురాలు మృతి
తుపాకీ పేలకపోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కుటుంబ సభ్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడింది వైఎస్సార్సీపీకి సంబంధించిన వాళ్లే చేసి ఉంటారని గిరినాయుడు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా తనపై ఓ పెట్రోల్ బంకు వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు దాడి చేశారని అతను తెలిపాడు.
ఇంట్లోకి చొరబడి మరీ దాడి చేయడం అనేది చాలా దారుణమన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని రాయచోటి డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు.
రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ శ్రేణులు - టీడీపీ నేతపై గొడ్డళ్లతో దాడి - murder attempt on tdp leader