ETV Bharat / state

నిజాంపేటలో షాకింగ్​ ఘటన- గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి హల్​చల్​, వీడియో వైరల్​ - Person Enters Nizampet Apartments

Unknown Person Enters Nizampet Apartment: హైదరాబాద్​లోని నిజాంపేటలో షాకింగ్​ ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి స్థానిక అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లోకి చొరబడి తలుపులు వేయడంతో ఆ ఇంట్లో ఉన్న మహిళ ధైర్యంగా వీడియో రికార్డు చేయడం మొదలు పెట్టింది. ‘నువ్వు ఎవరు? నీ పేరేంటి’ అంటూ ప్రశ్నించే సరికి, రెండో అంతస్థు నుంచి కిందకు దూకి పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది.

Unknown Person Enters Nizampet Apartments

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 10:48 AM IST

నిజాంపేటలో షాకింగ్​ ఘటన- గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చోరబడి హల్​చల్​, వీడియో వైరల్​

Unknown Person Enters Nizampet Apartment: హైదరాబాద్​లోని నిజాంపేట ఏరియాలో ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన పనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది. అనుకోకుండా ఓ భవంతిలోని రెండో అంతస్థులో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇంటి తలుపులు వేశాడు. ఇంట్లో ఉన్న మహిళ అతన్ని వీడియో తీస్తుండగా అతడు వద్దు నన్ను చంపడానికి వస్తున్నారు? గట్టిగా మాట్లాడకండి అంటూ చెప్పడం ఆ వీడియోలో కనిపిస్తుంది. వీడియో తీసే మహిళ నువ్వు ఎవరు? నీ పేరేంటి? ఇంట్లోకి ఎందుకు వచ్చావు? అంటూ ప్రశ్నలు సంధిస్తూ వీడియో రికార్డ్ చేస్తుంది.

హైదరాబాద్​లోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్​లో ఓ అపార్ట్​మెంట్​లోకి మధ్యాహ్నం పూట ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో ఉన్న మహిళ వెంటనే వీడియో తీయడం ప్రారంభించింది. నువ్వు ఎవరు? నీ పేరేంటి? ఇంట్లోకి ఎందుకు వచ్చావు? అంటూ ప్రశ్నలు సంధిస్తుండగా, అతడు భయపడుతూ గట్టిగా మాట్లాడకండి, నన్ను చంపడానికి వస్తున్నారని సమాధానం చెప్పాడు.

90ml బాటిల్ తెస్తేనే నీళ్లలోంచి బయటకొస్తా - హుస్సేన్​సాగర్​లో దిగి యువకుడి హల్​చల్

Apartment Viral Video in Nizampet: సదరు మహిళ ప్రశ్నలు వేస్తుండగానే ఇంట్లో నుంచి బయటకు వచ్చి, రెండో అంతస్థు నుంచి దూకి అతడు పరారయ్యాడు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోకి వచ్చిన వ్యక్తి మతి స్థిమితం సరిగ్గా లేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా బాచుపల్లి పోలీసులు తెలిపారు. అతడు పక్క కాలనీలో నివాసం ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న మహిళ సదరు వ్యక్తిపై ఎలాంటి కేసు వద్దని ఈ విషయాన్ని ఇంతటితో వదిలి వేయాలంటూ పోలీసులతో ఆమె చెప్పింది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఇంట్లోకి చొరబడటాన్ని చూస్తే ఎవరైనా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతారు. కానీ సదరు మహిళ మాత్రం ధైర్యంగా వీడియో తీస్తూ వివరాలు అడిగే ప్రయత్నం చేసింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు నగరంలో ఇంత ఘోరమైన పరిస్థితి ఉందా? చాలా జాగ్రత్తగా ఉండాలంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించి, సెల్​ఫోన్​లో వీడియో తీస్తూ దుండగుడు బయటకు వెళ్లేలా చేసిన సదరు మహిళ ధైర్య సాహసాలను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మహిళ ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

మూడు రోజుల శిశువును కిడ్నాప్ చేసిన మహిళ - వీడియో వైరల్

అదరగొట్టేస్సార్రా అబ్బాయిలు - భక్తి పాటకు మాస్ బీట్ వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.