One Person and 30 Sheeps Dead in Thunderstorm : రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే విధంగా పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 30 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏకధాటిగా వర్షం కురవడంతో వ్యాపారులు సైతం తీవ్ర అవస్థలు పడ్డారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కొట్టాల వద్ద పిడుగు పడి ట్రాక్టర్ డ్రైవర్ రమేష్ మృతి చెందాడు. అవుకు మండలం సంగపట్నం సమీపంలో పిడుగు పాటుకు 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంటలు సాగు చేసి చాలా రోజుల తర్వాత వర్షాలు రావడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. ఏకధాటిగా వర్షం కురవడంతో వ్యాపారులు తీవ్ర అవస్థలు పడ్డారు.
Contract Worker Dead in Visakha : విశాఖ జిల్లా గాజువాక స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న పెంటయ్య అనే వ్యక్తి పిడుగు పాటుకు గురయ్యారు. ఈ ఘటనలో పెంటయ్య అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వర్షం పడుతుండటంతో చెట్టు కింద నిలబడటంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Farmer Missing Was Falling Into Canal : ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం బైనేరు కాల్వలో పడి ఓ రైతు గల్లంతయ్యాడు. గేదెలను మేత కోసం తీసుకొచ్చి ప్రమాదవశాత్తు కాల్వలో పడి అదృశ్యమయ్యాడు. ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో ఒక్కసారిగా కాలువ పోటెత్తింది. దీంతో కాలువ ఉద్ధృతికి వరద నీటిలో కొట్టుకుపోయాడు. రైతు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అల్లూరి జిల్లాలో విషాదం - పిడుగుపడి ఇద్దరు మృతి - Two persons dead in thunderstorm