Two Died after Falling into a Pond: అనంతపురం జిల్లా కుందుర్పిలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని నీటి కుంటలో పడి ప్రమాదవశాత్తూ ఇద్దరు మృతి చెందారు. ఆరో తరగతి విద్యార్థి విష్ణు (11) పాఠశాలకు వచ్చి బహిర్భూమి కోసం వెళ్లాడు. అయితే ఆ సమయంలో ప్రమాదవశాత్తు సమీపంలోని నీటి కుంటలో పడిపోయాడు. ఇది గమనించిన యువకుడు నవీన్(21) బాలుడిని రక్షించటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో తనకు ఈత రాకపోయినా నీటి కుంటలోకి యువకుడు దూకాడు. ఇలా ఇద్దరూ నీటి కుంటలో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలిసిన కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో అన్ని విధాలా ఆదుకుంటామని మృతుల కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
అనంతలో విషాదం - స్కూల్ సమీపంలోని నీటికుంటలో పడి ఇద్దరు మృతి - Two Died after Falling into a Pond - TWO DIED AFTER FALLING INTO A POND
Two Died after Falling into a Pond: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ సమీపంలోని నీటి కుంటలో పడి ప్రమాదవశాత్తూ ఇద్దరు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పరామర్శించారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 10, 2024, 2:13 PM IST