ETV Bharat / state

'తిరుమల లడ్డూలపై అసత్య ప్రచారం నమ్మొద్దు'- ఇకపై వారికి ఆధార్ ఉంటేనే! - Illegal Laddu Sales in TTD - ILLEGAL LADDU SALES IN TTD

TTD has Taken Action on Illegal Sale of Laddus : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలోని లడ్డూకి ఎంతో ప్రత్యేకత ఉంది. మరే ఇతర ప్రసాదాలకు లేని రుచి, నాణ్యత అందులో ఉంటాయి. స్వామివారి దర్శన అనంతరం ప్రతి ఒక్కరూ లడ్డూలు తీసుకునే ఇంటికి పయనమవుతారు. ఇంత డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొంత మంది దళారులు తిరుమలలో కొన్న లడ్డూలను బయట అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై దృష్టి సారించిన టీటీడీ శ్రీవారి లడ్డూప్రసాదాలు పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టింది.

TTD has Taken Action on Illegal Sale of Laddus
TTD has Taken Action on Illegal Sale of Laddus (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 7:36 PM IST

TTD has Taken Action on Illegal Sale of Laddus : తిరుమల అంటేనే కలియుగ వైకుంఠనాథుని తర్వాత అందరికి గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదం. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూల కోసం భక్తులు పరుగులు తీస్తుంటారు. అంతేకాదు ఎన్ని లడ్డూలు దొరికితే అన్ని తీసుకుని వచ్చి బంధువులు, స్నేహితులకు ప్రసాదంగా పంచిపెడతాం. అయితే లడ్డూలకు భారీగా డిమాండ్​ ఉన్న నేపథ్యంలో కొంతమంది దళారులు తిరుమలలో కొన్న లడ్డూలను బయట అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పలువురు మోసాలకు గురవుతున్నారు. దీనిపై టీటీడీ దృష్టి సారించింది. లడ్డూ ప్రసాదాల విక్రయాలపై చర్యలు చేపట్టింది.

సప్తగిరి అతిథి గృహంలో టీటీడీ ఈవో తనిఖీలు- అధికారులకు మెమోలు - TTD EO Syamala Rao Inspection

అక్రమ లడ్డూ విక్రయాలపై ప్రత్యేక చర్యలు : దర్శనం టికెట్‌ లేకుండా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే వారికి ఇకపై గరిష్ఠంగా రెండు లడ్డూలు మాత్రమే ప్రసాదంగా ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదాలు పక్కదారి పట్టకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. దర్శనం టికెట్‌ లేనివారు ఆధార్‌ కార్డు చూపి రెండు లడ్డూలు కొనుగోలు చేయవచ్చని స్పష్టంచేశారు. సామాన్య భక్తులకు మేలు చేకూర్చడంతోపాటు దళారులను నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భక్తుల ముసుగులో కొందరు లడ్డూప్రసాదాలను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. ప్రసాదం పాలసీలో మార్పులు చేశారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

భక్తుల సౌకర్యాలపై ఫోకస్- తిరుమలలో మార్పులపై భక్తుల ఆనందం - AP Govt Key Changes in Tirumala

తిరుమలలో గణనీయమైన మార్పులు : అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో నాణ్యత పెంచడంతో పాటు ఆహార పదార్థాల సంఖ్యనూ పెంచారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు చేసే అన్నదానంలో మార్పులు చేశారు. అన్నదానానికి ముడిసరుకులు విరాళంగా ఇచ్చే దాతలతో సమావేశం నిర్వహించి నాణ్యమైన సరుకులు ఇవ్వాలని కోరడంతో పాటు బియ్యం సరఫరా దారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్న ప్రసాదాల నాణ్యత గణనీయంగా పెరిగింది. వెంగమాంబ అన్నదాన సత్రంలో చోటుచేసుకొన్న మార్పులపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీటీడీ పరిధిలో జరిగే అన్నప్రసాద వితరణలో నాణ్యత పెంచిన అధికారులు ప్రైవేటు హోటల్స్‌పైన ప్రత్యేక దృష్టిసారించారు.

శ్రీవారిని దగ్గరగా దర్శించుకునే అవకాశమివ్వండి - భక్తుడి ప్రశ్నకు టీటీడీ ఈవో ఏం చెప్పారంటే ! - TTD Dial your EO Program

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.