ETV Bharat / state

తిరుమల నెయ్యి కల్తీ ఘటన - AR డెయిరీపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు - TTD Complaint to Police on Ghee - TTD COMPLAINT TO POLICE ON GHEE

TTD Complaint to Police on AR Dairy About Ghee Adulteration Incident: నెయ్యి కల్తీ ఘటనపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. ఏఆర్‌ డెయిరీ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి తూర్పు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

ttd_complaint_to_police_on_ghee
ttd_complaint_to_police_on_ghee (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 4:27 PM IST

TTD Complaint to Police on AR Dairy About Ghee Adulteration Incident : తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. నెయ్యి సరఫరాలో ఏఆర్​ డెయిరీ ఫుడ్స్‌ నిబంధనలను అతిక్రమించిందని టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ జనరల్‌ మేనేజర్‌ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్వామి వారి లడ్డూతో పాటు ఇతర ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేయడంలో ఏఆర్​ డెయిరీ సంస్ధ నిబంధనలను అతిక్రమించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏఆర్​ డెయిరీ సంస్ధ కల్తీ నెయ్యిని సరఫరా చేయడం ద్వారా టీటీడీని మోసం చేసిందని పేర్కొన్నారు. కల్తీ నెయ్యి ద్వారా ప్రసాదాల తయారీతో దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వివరించారు. మార్చి నెలలో ఈ టెండర్ల ద్వారా నెయ్యి సరఫరా దక్కించుకున్న ఏఆర్ డెయిరీ ఫుడ్‍ సంస్ధ జూన్‍ 12, 20, 25, జూలై 4వ తేదీలలో వరుసగా 4 ట్యాంకర్‌లను సరఫరా చేసిందని తెలిపారు. టెండర్ షరతుల మేరకు నాణ్యత ప్రమాణాలు పాటించలేదని తెలిపారు. రుచి, వాసన సరిగ్గా లేకపోవడంతో గుజరాత్​లోని ఎన్​డీడీబీ (NDDB), సీఏఎల్​ఎఫ్ ​(CALF) ల్యాబ్​కు పంపి పరీక్షలు నిర్వహించామని ఫిర్యాదులో తెలిపారు.

ల్యాబ్‍ నివేదిక మేరకు కూరగాయల నూనెలు, జంతువుల కొవ్వు ఆధారిత కల్తీ పదార్థాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలిందన్నారు. టెండర్‍ ఒప్పందం మేరకు నాణ్యత పాటించడంలో విఫలమైన ఏఆర్​ సంస్ధపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరారు. నాణ్యత లేని నెయ్యి సరఫరా చేయడం వెనక కుట్ర ఉందని సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు, తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని మురళీకృష్ణ ఫిర్యాదులో కోరారు.

తిరుమల ప్రసాదం వడ నుంచి లడ్డూగా ఎలా మారిందంటే? - శ్రీవారికి ఎన్ని నైవేద్యాలు పెడతారో తెలుసా? - Tirumala Laddu History in Telugu

తిరుమల లడ్డూ వ్యవహారం - సిట్​ చీఫ్​గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి నియామకం - Sarva Sreshta Tripathi as SIT Chief

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.