ETV Bharat / state

టీఎస్​పీఎస్సీ గ్రూప్​ ఎగ్జామ్స్​ తేదీలు విడుదల - ఆగస్టులో గ్రూప్​-2 పరీక్షలు

TSPSC Announced Group Exams Dates : గ్రూప్స్​ ప్రిపేర్​ అయ్యే అభ్యర్థులకు టీఎస్​పీఎస్సీ తీపి కబురు చెప్పింది. గ్రూప్స్​ పరీక్ష తేదీలను టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్​-2, గ్రూప్​-3 పరీక్ష తేదీలు, గ్రూప్​-1 మెయిన్స్​ తేదీలను ప్రకటించింది.

TSPSC_Announced_Group_Exams_Dates
TSPSC_Announced_Group_Exams_Dates
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 4:07 PM IST

Updated : Mar 6, 2024, 6:19 PM IST

TSPSC Announced Group Exams Dates : గ్రూప్స్​ ప్రిపేర్​ అయ్యే అభ్యర్థులకు టీఎస్​పీఎస్సీ శుభవార్త చెప్పింది. గ్రూప్స్​ పరీక్ష తేదీలను టీఎస్​పీఎస్సీ(TSPSC) ప్రకటించింది. గ్రూప్​-2, గ్రూప్​-3 పరీక్ష తేదీలు, గ్రూప్​-1 మెయిన్స్(Group 1 Mains)​ తేదీలను ప్రకటించింది. ఆగస్టు7,8 తేదీల్లో గ్రూప్​ -2 పరీక్షను నిర్వహించనున్నట్లు పబ్లిక్​ సర్వీసు కమిషన్​ తెలిపింది.

నవంబరు 17,18 తేదీల్లో గ్రూప్​-3 పరీక్షను నిర్వహించనున్నారు. అక్టోబరు 21 నుంచి గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. గ్రూప్​-1కు 563 పోస్టులు, గ్రూప్​-2కు 783 పోస్టులు, గ్రూప్​-3కి 1388 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ పరీక్షలు నిర్వహించనుంది.

TSPSC Announced Group Exams
టీఎస్​పీఎస్సీ గ్రూప్​ ఎగ్జామ్స్​ తేదీలు విడుదల

TSPSC Group-1 Prelims Exam : ఇప్పటికే గ్రూప్​ 1 ప్రిలిమ్స్​ పరీక్ష(Group 1 Prelims Exam)ను జూన్​ 9వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. అందుకు సంబంధించి గత నెల 24వ తేదీన నోటిఫికేషన్​ను పబ్లిక్​ సర్వీసు కమిషన్​ విడుదల చేసింది. గతంలో ఈ గ్రూప్​1 పరీక్ష పేపర్​ లీకేజీ వ్యవహారం, పరీక్షల్లో సరైన నిబంధనలు పాటించ లేదన్న కారణంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్​కు సంబంధించిన ఆన్​లైన్​ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా, మార్చి 14వరకు అభ్యర్థుల నుంచి ఆన్​లైన్​లో అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి మార్చి 27 సాయంత్రం 5 గంటల వరకు సరిచేసుకోవచ్చని టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్​లో తెలిపింది. గత నోటిఫికేషన్​లో దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు ఫీజు మినహాయింపును కూడా ఇచ్చారు.

TSPSC Group-2 Exam Dates : జనవరి 6, 7వ తేదీల్లో జరగాల్సిన గ్రూప్​-2 పరీక్ష(TSPSC Group 2)లను ఇప్పటికే టీఎస్​పీఎస్సీ వాయిదా వేసింది. ఈ పరీక్షలకు సుమారు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొదట గతేడాది ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్​-2 పరీక్ష నిర్వహించడానికి టీఎస్​పీఎస్సీ సన్నాహకాలు చేసింది అయితే ఆ సమయంలో మరికొన్ని పోటీ పరీక్షలు ఉన్నందున వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్​ చేయడంతో నవంబరు 2,3 తేదీలకు వాయిదా వేశారు. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్​ రావడంతో జనవరి 6,7 తేదీలకు మార్చారు. అయితే ప్రభుత్వం మారడం, టీఎస్​పీఎస్సీ కమిషన్​ సభ్యులు రాజీనామా చేయడంతో కొత్త కమిషన్​ కొలువుతీరింది. ఆ తర్వాత ఆ తేదీలలో కూడా జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసి ఇప్పుడు ఆగస్టు 7,8 తేదీలకు టీఎస్​పీఎస్సీ మార్చింది.

Last Updated : Mar 6, 2024, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.