ETV Bharat / state

అంతుచిక్కని జ్వరాలు - అల్లాడుతున్న గిరిజనులు - Tribals Suffering with Fever

Tribals Suffering With Fever and Bodypains in Palnadu District : అవి గిరిజన తండాలు. ప్రతి ఇంట్లో ఎవరో ఒక్కరూ జ్వరాల బారిన పడుతూనే ఉన్నారు. ఒంటినొప్పులు భరించలేక అవస్థలు పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా విజృంభిస్తుండటం వల్ల గిరిజనలు అల్లాడిపోతున్నారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Seva_Naik_Tanda_Tribals_Sick_At_Veldurthi_Mandal

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 10:44 AM IST

అంతుచిక్కని జ్వరాలు - అల్లాడుతున్న గిరిజనులు

Tribals Suffering With Fever and Bodypains in Palnadu District : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గిరిజన తండా వాసులు అంతుచిక్కని జ్వరాలు, ఒంటి నొప్పులతో సతమతమవుతున్నారు. అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ రోగాలతో సావాసం చేస్తున్నారు.

పారిశుద్ధ్య లోపం.. పంజా విసురుతున్న జ్వరాలు.. ఇద్దరు చిన్నారులు మృతి

Tribals Suffering From Fever and Body Pains: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండంలోని అనేక తండాల ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. సేవా నాయక్ తండాలో నివసించే గిరిజనులు, చెంచులు జ్వరాలతో సావాసం చేస్తున్నారు. తండాలోని ప్రతి ఇంట్లో జ్వర బాధితులున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. అన్ని వయసుల వారు జ్వరాలు, కాళ్లు, చేతులు, కీళ్ల నొప్పులతో పడరాని పాట్లు పడుతున్నారు. ఈ అంతుబట్టని జ్వరాలు తండాలో ఎవరిని వదిలిపెట్టడం లేదని వాపోతున్నారు. పారిశుద్ధ్య లోపం (Lack of sanitation) తాగునీటి సమస్యో తెలీదు కాని ప్రతి ఒక్కరూ బాధితులే. కొంతమంది కనీసం నడిచే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకేరోజు 13వేల మందికి 'వింత జ్వరం'.. భయంతో ఆస్పత్రికి పరుగు.. ప్రభుత్వం అలర్ట్

అధికారులు మా సమస్యను పరిష్కరించాలి: అధికారులు తండాల్లో వైద్య శిబిరాలు (Medical camps) ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి, మందులు (Medicines) ఇచ్చారని స్థానికులు వెల్లడించారు. ఆ మందులు వేసుకుంటే తప్ప పనులు చేసుకోలేకపోతున్నామని అక్కడి ప్రజలు అంటున్నారు. జ్వరాలు, నొప్పులకు కారణాలను డాక్టర్లు కూడా తేల్చలేకపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

"జ్వరాలు, కాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నాము. జ్వరం వస్తే రూ. 5 నుంచి 10 వేలు వరకూ ఖర్చు అవుతుంది. మందులు వేసుకుంటే ఒకరోజు బావుంటుంది. తర్వాత కీళ్ల నొప్పులు మాములే. " -స్థానికులు

తండాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. వెయ్యి అడుగుల మేర బోర్లు వేసినా చుక్క నీరు పడటం లేదు. ఒక్క బోర్ మీదే ఆధారపడి తండా వాసులు అందరం బతుకుతున్నామని ఆ నీరు మురుగుగా ఉంటుందని వారు వాపోతున్నారు. నీటికి తోడు పారిశుద్ధ్యం లోపించిందని వాపోతున్నారు. అధికారులు స్పందించి తమ ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.

రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న జ్వరాలు.. నిర్ధారణే అసలైన పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.