ETV Bharat / state

తిరుపతిలో అక్రమాలపై 'ఆమె' దృష్టి- 20రోజుల్లోనే ఎస్పీ బదిలీ

Tirupati SP Malika Garg Transferred: తిరుపతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన 20 రోజులు కాకముందే మలికాగార్గ్‌పై బదిలీ వేటు పడింది. ఎస్పీ మలికాగార్గ్‌ను సీఐడీకి బదిలీ చేసింది. ఆమె స్థానంలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్​ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tirupati SP Malika Garg Transferred
Tirupati SP Malika Garg Transferred
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 5:10 PM IST

Tirupati SP Malika Garg Transferred: తిరుపతి ఎస్పీ మలికాగార్గ్‌ను ఏపీ ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. మలికాగార్గ్‌ స్థానంలో విజయవాడ శాంతిభద్రతల విభాగానికి చెందిన డీసీపీ కృష్ణకాంత్‌ పటేల్‌ను నియమిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మలికాగార్గ్‌ తిరుపతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టి కేవలం 20 రోజులు అవుతుంది. ఈ వ్యవధిలోనే, అది కూడా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు కొద్ది రోజుల ముందు మలికాగార్గ్‌కు స్థానచలనం కలిగించటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికార వైఎస్సార్సీపీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోనే ఎస్సీని బదిలీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
SP Malika Garg: చంద్రబాబు లేఖ దిగ్బ్రాంతికి గురి చేసింది : ప్రకాశం ఎస్పీ

విధుల్లో నిక్కచ్చిగా, చట్ట ప్రకారం వ్యవహరిస్తే: మలికాగార్గ్‌ అంతకుముందు ప్రకాశం ఎస్పీగా ఉన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆమె తిరుపతి ఎస్పీగా బదిలీ అయ్యారు. మలికాగార్గ్‌ను తిరుపతి రానివ్వకుండానే బదిలీ చేయించాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరికి అదే నెల 12న తిరుపతి ఎస్పీగా మలికాగార్గ్‌ బాధ్యతలు చేపట్టారు. విధుల్లో నిక్కచ్చిగా, తటస్థంగా, చట్ట ప్రకారం వ్యవహరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా పనిచేయొద్దని, నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సిబ్బందికి ఆమె ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అక్రమాలతో పాటుగా నమోదైన కేసులపై సైతం ఆమె దృష్టి సారించారు. ఆ కేసులను పక్కదారి పట్టించిన వ్యవహారంపై ఆమె ఎన్నికల సంఘానికి ఏదైనా నివేదిక సమర్పిస్తే, సార్వత్రిక ఎన్నికల వేళ తమకు మరింత ఇబ్బందిగా మారుతుందని వైఎస్సార్సీపీ నేతలు భావించి ఆమెను బదిలీ చేపించారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Prakasam District Dalit Woman Case Updates: 'ప్రణాళిక ప్రకారమే దాడి'.. ప్రకాశం జిల్లాలో దళిత మహిళపై దాడి వివరాలను వెల్లడించిన ఎస్పీ

తమ మాట వినడం లేదనే బదిలీ: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ముగ్గురు సీఐలు తమ పార్టీకి చెందిన 50-70 ఏళ్ల వారిపై అక్రమంగా రౌడీషీట్లు తెరుస్తున్నారని టీడీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సీ ఆ ముగ్గురు ఇన్‌స్పెక్టర్లపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పెళ్లకూరులో పెద్దఎత్తున జరుగుతున్న గ్రావెల్‌ అక్రమ తవ్వకాల వ్యవహారంలో వైఎస్సార్సీపీకి చెందిన రెడు వర్గాలు గొడవలగు దిగాయి. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు అత్యంత సన్నిహితుడైన నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, పోలీసుస్టేషన్‌ ఎదుట ధర్నా చేశాడు. అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపైనే దాడి చేశారు. ఆయనపై కేసు నమోదు చేయొద్దంటూ, వైఎస్సార్సీపీ నేతలు ఒత్తిడి తెచ్చినా సరే ఎస్పీ మలికాగార్గ్‌ కేసు నమోదు చేసేలా చర్యలు చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి కనుసన్నల్లో అరణియార్‌ నదిలో నుంచి అక్రమంగా ఇసుక తవ్వి సురుటుపల్లి మీదుగా చెన్నైకు తరలిస్తుంటారు. మలికాగార్గ్‌ ఇటీవల సురుటుపల్లి చెక్‌పోస్టును తనిఖీ చేసి, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ అంశాలన్నీ ఎస్సీ బదిలీకి కారణమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఒంగోలులో భూకబ్జాల వెనక పూర్ణచంద్రరావు ముఠా! సిట్ దర్యాప్తులో 38 మంది అరెస్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.