TIRUMALA VAIKUNTA DWARA DARSHANAM TICKETS: తిరుమల శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై టీటీడీ ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్యతో కలిసి అన్నమయ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
టీటీడీ నిర్ణయాలివే:
- వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
- 24వ తేదీన ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్‌ఈడీ (Special Entry Darshan) టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
- జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 సెంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు.
- తిరుపతిలోని ఎంఆర్ పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా స్టేడియం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లను జారీ చేస్తారు.
- టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
- వైకుంఠ ద్వార దర్శన రోజులలో టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టికెట్లు లేని భక్తులను క్యూలైన్లలోకి అనుమతించమని తెలిపారు.
- వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి.
- వైకుంఠ ఏకాదశి రోజు అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
- వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం
- వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 గంటల నుంచి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం
- తిరుమల వచ్చే గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదని తెలిపారు.
- వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
- ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశించారు.
- టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
- లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ అందుబాటులో మూడున్నర లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచనున్నారు. అదనంగా మరో 3.50 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశించారు.
శ్రీవారి భక్తులకు శుభవార్త - రేపటి నుంచి 'మార్చి 2025' దర్శన టికెట్ల విడుదల
శ్రీవారి దర్శనానికి ఎన్నెన్ని దారులో - సర్వదర్శనం నుంచి స్లాటెడ్ బుకింగ్ వరకు మీకోసం