Three Ladies Dead Bodies Found in Pond at Kurnool : కర్నూలు జిల్లాలో ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా మృతి చెందటం తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని గార్గేయపురం గ్రామ శివారులో ఉన్న నగరవనం (Nagaravanam) చెరువులో తొలుత ఇద్దరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాలను పరిశీలించారు. అనంతరం చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని గుర్తించారు. మృతులు ఎవరు? ఎలా చనిపోయారు? అనేది మిస్టరీగా మారింది. ఎవరైనా చంపి చెరువులో పడేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నెల్లూరులో హృదయ విదారక ఘటన - గంటల వ్యవధిలో ప్రాణాలు విడిచిన అక్కాచెల్లెళ్లు
మృతులు ఎవరు? ఎలా చనిపోయారు? అంతు చిక్కని ప్రశ్నలు : కర్నూలు సమీపంలోని గార్గేయపురం గ్రామంలో ఉన్న నగరవనం చెరువులో ఈ రోజు(ఆదివారం) ముగ్గరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తొలుత చెరువులో ఇద్దరి మృతదేహాల్ని స్థానికులు గుర్తించి కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. అయితే చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని వారు గుర్తించారు. మృతులు ఎవరు? ఎలా చనిపోయారు? అనేది ప్రస్తుతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. మృతదేహాలను శవపరీక్ష కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రాణం తీసిన ఈత సరదా- ఊపిరాడక ఇద్దరు విద్యార్థులు మృతి - Children drowned in the pond
ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా? లేక ఆత్మహత్య : ముగ్గురు మహిళలు చనిపోవడంతో వారిని ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. శవపరీక్షల నివేదిక ఆధారంగా కేసును విచారణ చేస్తామని వారు తెలిపారు. మృతదేహాలను గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. దీనిపై ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిని తీసుకువచ్చి మృతదేహాలను గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కదులుతున్న బస్సులో సడెన్గా మంటలు- 9మంది సజీవ దహనం- మరో 24మందికి గాయాలు - Bus Fire Accident