ETV Bharat / state

పోలీసులతో దొంగాట - ఖాకీలకు మస్కా కొట్టి ఠాణా నుంచి రెండు సార్లు పరార్! - Thief escaped from police station

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 9:38 AM IST

Updated : Aug 6, 2024, 10:39 AM IST

Thief Escapes From Police Station in Hyderabad : ఇళ్లలోని కుళాయిలు చోరీ చేస్తున్న దొంగను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగ పోలీసులకు మస్కా కొట్టి స్టేషన్ నుంచి రెండు సార్లు పరార్ అయ్యాడు. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Thief Escapes From Police Station
Thief Escapes From Police Station (ETV Bharat)

Thief Escaped Second Time From Police Station : అతగాడు ఓ దొంగ, అలా అని గజదొంగ కాదు. ఇళ్లలో కుళాయి పైపులను చోరీ చేస్తుంటాడు. తరచూ దొంగతనాలు చేస్తుండటంతో పక్కా ప్లాన్ వేసి అతన్ని స్థానికులు పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అయితే, పోలీసుల కళ్లుగప్పి ఆ దొంగ పరారయ్యాడు. వెంటనే అతడి కోసం గాలించి ఆచూకీ కనిపెట్టి జైల్లో వేశారు. మళ్లీ ఠాణా నుంచి ఖాకీలకు మస్కా కొట్టి పారిపోయాడు. ఇలా రెండు సార్లు పోలీస్​స్టేషన్ నుంచి పరార్ అయిన ఘటన యూసుఫ్​గూడ పరిధిలో చోటుచేసుకుంది. పరారైన దొంగను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.

పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్ యూసుఫ్​గూడ సమీపంలోని యాదగిరినగర్​లో ఇటీవల కాలంలో ఇళ్లలోని కుళాయిలు చోరికి గురవుతున్నాయి. అనుమానం వచ్చి స్థానికులు దగ్గర్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ఓ దొంగ నల్లాలను కాజేస్తున్నట్లుగా కనిపించింది. ఈ వీడియోలు కాస్త బస్తీ కమిటీ నాయకులు వాట్సాప్​ గ్రూపుల్లో ఫార్వార్డ్​ చేశారు.

చివరికి ఈ నెల 1వ తేదీన నిఘా పెట్టి దొంగను స్థానికులు పట్టుకున్నారు. యాదగిరి నగర్ జనరల్ సెక్రటరీ కె.మహేందర్ దొంగను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. పట్టుబడ్డ దొంగ నేపాల్​కు చెందిన వికాస్​గా గుర్తించారు. ఠాణా నుంచి అదే రోజు దొంగ పరారయ్యాడు. మళ్లీ జూబ్లీహిల్స్ ప్రాంతంలో శుక్రవారం రోజున రెండో సారి దొంగను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్​లో ఉంచారు. మధురానగర్ పోలీసులకు మస్కా కొట్టి పోలీసు స్టేషన్ నుంచి ఆదివారం సాయంత్రం మళ్లీ పారిపోయాడు ఆ దొంగ.

ఈ క్రమంలో విధి నిర్వహణలో పోలీసుల నిర్లక్ష్యం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగ పరారవ్వడంతో వెంటనే పెట్రోలింగ్, బ్లా కోల్డ్స్​ పోలీసుల్ని అప్రమత్తం చేసి వెదికినా నిందితుడి జాడ లభ్యం కాలేదు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుస దొంగతనాలకు పాల్పడుతూ, పోలీసులకే సవాల్ విసురుతున్న దొంగను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

కుళాయి దొంగను పట్టించిన వాట్సాప్ గ్రూప్ - ఖాకీలకే మస్కా కొట్టి ఠాణా నుంచి పరార్ - Thief Escapes From Police Station

ఒక్క రూపాయి కూడా లేదని కెమెరా ముందు దొంగ దండాలు - వైరలవుతున్న వీడియో - Variety Thief in Maheshwaram

Last Updated : Aug 6, 2024, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.