Crop Loan Waiver In Telangana 2024 : రెండు లక్షల్లోపు రైతు రుణమాఫీపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. చాలామంది లబ్ధిదారులకు మాఫీ అందలేదని విపక్ష నేతలు విమర్శిస్తుండగా అర్హులందరికీ న్యాయం చేస్తామని సర్కార్ భరోసా ఇస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేశామని రూ.2లక్షల పైబడిన వారికి సైతం రుణమాఫీ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే ప్రతి బ్యాంకు, వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద నియమించిన నోడల్ అధికారులను సంప్రదించాలని సూచించారు.
అధికారంలోకి వచ్చిన 8నెలల్లోనే రుణమాఫీ : రుణమాఫీపై రాష్ట్ర సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని హరీశ్ రావు సైతం తన మాటకు కట్టుబడి పదవికి రాజీనామా చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేశామని పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎందుకు రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు.
మూడో విడత రుణమాఫీ - వారి అకౌంట్లలో మాత్రమే డబ్బులు జమ అవుతున్నాయి! - Third Phase Crop Loan Waiver
"31వేల కోట్లు రుణమాఫీ అని రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశారని అంటున్నారు. వాళ్లకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడంలేదు. మూడు విడతల్లో రుణమాఫీ అవుతుందని చెప్పాము. రెండు లక్షలపైన రుణం ఉంటే రెండు లక్షలకు ఎంత రుణం ఎక్కువ ఉందో వారు ఆ డబ్బులను అకౌంట్లో జమ చేస్తే రూ.2లక్షల రుణమాఫీ అవుతుంది. రుణమాఫీ జరగని వారు ప్రతిగ్రామంలో రైతువేదిక ఉంటుంది అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తే మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారు." - తుమ్మల నాగేశ్వర రావు, వ్యవసాయశాఖ మంత్రి
అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే ఇచ్చిన హామీలను అమలు చేశామని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వమన్నారు. నల్గొండ జిల్లా రైతాంగానికి ఉపయోగపడేలా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. కేటీఆర్‌కు రాజకీయ పరిజ్ఞానం, అనుభవం లేక ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. మూడు విడతల్లో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.
మూడో విడత రుణమాఫీ డబ్బులు అందని వారికి గుడ్‌న్యూస్ - సర్కారు సరికొత్త నిర్ణయం! - crop loan waiver