MARRIAGE CERTIFICATE ISSUE IN AP:ఏలూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి అత్యవసరంగా వివాహ రిజిస్ట్రేషన్‌కు ఇటీవల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సిబ్బందిని అడిగితే కార్యాలయం ముందున్న షాపులో ఉన్న వ్యక్తి నంబర్ ఇచ్చి ఆయనతో మాట్లాడమని చెప్పారు. తీరా అతని వద్దకు వెళ్లి చూస్తే రూ.5వేలు ఇస్తే వెంటనే పని అయిపోతుందని చెప్పడంతో వారు అవాక్కయ్యారు. పాలకొల్లుకు చెందిన దంపతులకు రెండేళ్ల కిందట వివాహమైంది. వీరు విజయవాడలో నివాసం ఉంటున్నారు. సెప్టెంబరులో వచ్చిన వరదల్లో వారి పెళ్లి ఫొటోలు గల్లంతయ్యాయి. వీరికి అత్యవసరంగా వివాహ ధ్రువపత్రం అవసరమైంది. దీంతో పాలకొల్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ మధ్యవర్తిని కలిశారు. ఫొటోలు లేకుండా చేయాలంటే రూ.10వేలు ఖర్చవుతుందని సిబ్బంది చెప్పారు.
తప్పు చేసి 'సారీ' అంటే ఊరుకుంటామా? - ఏ ఒక్కరినీ వదిలేదిలేదు : లోకేశ్
500 బదులు 5000 వసూలు: ఉభయ జిల్లాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ మాత్రమే కాదు. పెళ్లి రిజిస్ట్రేషన్‌కు సైతం భారీగా దండుకుంటున్నారు. నేరుగా వెళ్లైన వారికి ఎక్కడా లేని నిబంధనలు చెప్పి వారికి పంగనామాలు పెడుతున్నారు. అన్నీ సవ్యంగా ఉండి రూ.500 చలానాకు మంజూరు చేయాల్సిన ధ్రువపత్రానికి రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. అధికారులు, సిబ్బంది మధ్యవర్తులతో కుమ్మక్కై దోచేస్తున్నారు. అన్ని పత్రాలుంటే ఒక రేటు, లేకుంటే మరో రేటు ఒకవేళ అత్యవసరమైతే ఇంకో ధర చెప్పి వారిని నిలువెల్లా దోపీడీ చేస్తున్నారు.
జగన్ మెడకు అదానీ స్కామ్ - చేతులు మారిన రూ.1750 కోట్లు - అమెరికా కోర్టు ఆరోపణ
తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడి: పెళ్లి రిజిస్ట్రేషన్ చేసి ధ్రువపత్రాలు ఇచ్చేందుకు పెళ్లి శుభలేఖ, ఫొటోలు, వయసు నిర్ధారణ ధ్రువపత్రాలు, భార్యాభర్తలతో ముగ్గురు సాక్షుల ఆధార్ కార్డులు ఉండాలి. పెళ్లి జరిగి రెండు నెలలు దాటితే అఫిడవిట్ సమర్పించాలి. ఆన్‌లైన్ ద్వారా రూ.500 చెల్లిస్తే స్లాట్‌బుక్ అవుతుంది. దాని ప్రకారం సమయానికి వెళితే రిజిస్ట్రేషన్ చేయాలి. దళారులు దరఖాస్తుదారుల అవసరాన్ని బట్టి రేట్లు పెట్టారు. ఒక్కరోజులో పత్రం ఇవ్వాలంటే రూ.8వేల వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అన్ని దస్త్రాలు లేకుండా చేయాలంటే రూ.10వేల వరకు గుంజుతున్నారు. వివాహ ధ్రువపత్రాలకు లంచం తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.
సొంతలాభం కోసం ప్రజలపై భారాన్నీ లెక్కచేయని జగన్
జగన్ అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్! - అవినీతిలో తగ్గేదేలే