Fish Fell on the Road in Mahabubabad : రోడ్డుపై లెక్కలేనన్ని లైవ్ ఫిష్. అడిగేవాడు లేడు. పైసలు తీసుకొని అమ్మేవారు లేరు. దొరికిన వారికి దొరికినంత. ఈ ఆఫర్ ఎక్కడ అని అనుకుంటున్నారా? మహబూబాబాద్‌లో. కానీ సేల్ కాదు. అలా అని దానమూ కాదు. అసలు మ్యాటర్ ఏంటంటే మహబూబాబాద్ జిల్లా మరిపెడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్లాల్సిన చేపల లోడు వ్యాన్ మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చేరుకుంది. ఈ క్రమంలోనే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీరారం గ్రామానికి చెందిన ఐలయ్య అనే వ్యక్తిని తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి పల్టీ కొట్టింది. వ్యాన్ రహదారిపై అడ్డంగా పడిపోయింది. దీంతో చేపలన్నీ ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాయి. వాటిని చూసిన జనం పట్టుకునేందుకు ఎగబడ్డారు. పెద్ద పెద్ద సంచులు తీసుకువచ్చి అందులో చేపలను వేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. పోలీసులు వచ్చినా, అప్పటికే బాాగా ఆలస్యం అయిపోయింది.
రోడ్డంతా చేపల మయం - అమ్మేది లేదు, కొనేది లేదు - దొరికినోళ్లకు దొరికినన్ని - Fish Fell on the Road - FISH FELL ON THE ROAD
Fish Fell on the Road in Mahabubabad : రోడ్డంతా చేపలే. మొత్తం జనాలే. మార్కెట్ అనుకుంటే పొరబడినట్టే. మార్కెట్ అస్సలు కాదు. రోడ్డుపై చేపల లోడ్‌తో వెళ్తున్న ఓ వ్యాన్ బోల్తాపడగా, అందులో ఉన్న చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. దీంతో ప్రజలు ఎగబడి వాటిని క్షణాల్లో మాయం చేశారు.
Published : Sep 24, 2024, 11:14 AM IST
|Updated : Sep 24, 2024, 12:50 PM IST