AP EV policy In Andhra Pradesh: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను అభివృద్ధిపరిచే లక్ష్యంతో సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని 4.0ను ప్రభుత్వం రూపొందించింది. 2024-29 సంవత్సరానికి ఈ పాలసీ అమల్లో ఉంటుంది. విద్యుత్తు వాహనాల తయారీదారులతోపాటు కొనుగోలుదారులకూ రాయితీలను ప్రకటించింది. విద్యుత్తుతో నడిచే ద్విచక్రవాహనాలు, ఆటోలు, బస్సులు, రవాణా వాహనాలు, ట్రాక్టర్లకు ఎక్స్‌షోరూం ధరలో 5 శాతం రాయితీ వర్తిస్తుంది
ఆర్‌వీఎస్‌ఎస్ ఆపరేటర్ నుంచి సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ తీసుకుంటే ధరలో 10 శాతం రాయితీ ఇస్తుంది. 2027 మార్చి వరకు మాత్రమే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్ని విద్యుత్ వాహనాలకు ఐదేళ్లపాటు రోడ్డు ట్యాక్స్ మినహాయింపు. హైబ్రిడ్ వాహనాలకు ఈ మినహాయింపు వర్తించదని పాలసీలో తెలిపింది. ఎక్స్ షోరూమ్ ధరకు కూడా పరిమితి విధించింది. ద్విచక్రవాహనానికి గరిష్ఠంగా రూ.లక్ష, త్రిచక్రవాహనానికి రూ.2 లక్షలు, సరకు రవాణా వాహనానికి రూ.5 లక్షలు, ట్రాక్టర్‌కు రూ.6 లక్షలు, విద్యుత్ బస్సుకు రూ.2 కోట్ల వరకు పరిమితిగా తీసుకుని రాయితీ వర్తింపజేస్తారు. మొదటి 5 వేల ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే వారికి ఖర్చులో 25% (గరిష్ఠంగా రూ. 3లక్షల) వరకు రాయితీ ఇస్తుంది.
విధానపరమైన లక్ష్యాలు:
- 2029 లోగా 2 లక్షల విద్యుత్ వాహనాలను రిజిస్టర్ చేయడం
- 2029 నాటికి కనీసం 10 వేల త్రిచక్ర వాహనాలు
- 2029 నాటికి 20 వేల కొత్త కార్లను తీసుకురావడం
- ఆర్టీసీలో నూరు శాతం విద్యుత్ బస్సుల వినియోగం
- 30 కి.మీ.లకు ఒక విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటు
- ఈ-మొబిలిటీ నగరాల నిర్మాణానికి రూ.500 కోట్లతో కార్పస్ నిధి
- ఈ-మొబిలిటీ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు 100 ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు
పరిమితులు:
- ఈవీ రంగంతో అనుసంధానమై ఉన్న భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన అభిప్రాయాలపై పాలసీ విధానాలను ప్రభుత్వం రూపొందించింది.
- ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాల తయారీ యూనిట్లు
- పబ్లిక్, ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ఛార్జింగ్/ స్వాపింగ్ స్టేషన్లు
- రాష్ట్రంలో కొనుగోలు చేసిన విద్యుత్ వాహనాలు, రిజిస్ట్రేషన్ చేయడం
- ప్రజా రవాణా ఆపరేటర్లు, మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్లు
- రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీస్ (ఆర్‌వీఎస్‌ఎఫ్) ఆపరేటర్లు, ఈ- వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్లు, ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లు (ఏటీఎస్)
- ప్రైవేట్ పార్కు డెవలపర్లు
- రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ కేంద్రాలు, టెస్టింగ్ ఏజెన్సీలు
- పాలసీ అమలు పర్యవేక్షణకు ఏడు ప్రభుత్వ శాఖలను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది.
- ఎంఎస్ఎంఈ లకు ప్రోత్సాహకాలు
- ఉత్పత్తిలోకి వచ్చిన తేదీ నుంచి వార్షిక టర్నోవర్‌లో 5 శాతం చొప్పున మూడేళ్లపాటు గరిష్ఠంగా రూ.10 కోట్లు
- బీసీ/ ఎస్సీ/ ఎస్టీ/ మైనారిటీ/ దివ్యాంగులు/ ట్రాన్స్‌జెండర్లకు
- ఎఫ్‌సీఐలో 45 శాతం. గరిష్ఠంగా రూ.7 కోట్లు లేదా
- ఉత్పత్తిలోకి వచ్చిన తేదీ నుంచి వార్షిక టర్నోవర్‌లో 15 శాతం చొప్పున మూడేళ్లపాటు చెల్లింపు.. గరిష్ఠంగా రూ.10 కోట్లు.
- యూనిట్‌కు రూపాయి చొప్పున ఆరేళ్లపాటు విద్యుత్ రాయితీ. ఏడాదికి గరిష్ఠంగా రూ.15 లక్షలు
- జీఎస్టీ పూర్తిగా తిరిగి చెల్లింపు (ఏసీఐగా చూపిన మొత్తానికి మించనప్పుడు మాత్రమే)
- ఆరేళ్లపాటు విద్యుత్ సుంకంలో 50% శాతం రాయితీ (ఈవీల్లో వినియోగించే బ్యాటరీ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసిన వారికి మాత్రమే)
- పేటెంట్ హక్కులు పొందేందుకు చేసిన ఖర్చు.. గరిష్ఠంగా రూ.2 లక్షలు
- పారిశ్రామిక అవసరాలకై కొనుగోలు చేసిన భూములకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయింపు
- భూముల వినియోగ మార్పిడి ఛార్జీలు పూర్తిగా మినహాయింపు
- ఉద్యోగి తరఫున యాజమాన్యం చెల్లించాల్సిన ఈపీఎఫ్ పూర్తిగా మూడేళ్లపాటు తిరిగి చెల్లింపు.. ఒక్కో సంస్థకు గరిష్ఠంగా రూ.లక్ష
- జీఎస్టీతో కలుపుకుని ప్రోత్సాహకాల కింద ఎంఎస్‌ఎంఈలకు చెల్లించే మొత్తం ఎఫ్‌సీఐలో 75 శాతానికి దాటకూడదు.
- రవాణా రంగంలో వినూత్నమైన విధానానికి రూ.250 కోట్ల నిధులు అందుతాయి.
- పీఎల్‌ఐ స్కీం కింద ప్రోత్సాహకం
ఈ ప్రోత్సాహకం పెట్టుబడి రాయితీకి అదనంగా ఉంటుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టులకు.. రాష్ట్రం ఎప్పటికప్పుడు నోటిఫై చేసే ఏదైనా కేంద్ర పథకం కింద వర్తిస్తుంది.
- ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ప్రోత్సాహకల్లో 10 శాతం రాష్ట్రం అందిస్తుంది. రాష్ట్రంలో పెట్టిన ఎఫ్‌సీఐలో గరిష్ఠంగా 5 శాతానికి మించకూడదు.
- డీసీపీ నుంచి 5 ఏళ్లపాటు ప్రోత్సాహక మొత్తం సమాన వాయిదాల్లో చెల్లింపు
- డీ-కార్బనైజ్డ్ సబ్సిడీ
6. నికర జీఎస్టీ పూర్తిగా మినహాయింపునిస్తుంది
7. యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్ ఛార్జీల్లో రాయితీ. వార్షిక విద్యుత్ బిల్లులో 10 శాతానికి మించకుండా రెండేళ్లపాటు చెల్లింపు
8. విద్యుత్ సుంకంలో 50% రాయితీ. రెండేళ్లపాటు వర్తింపు
9. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, వినియోగమార్పిడి ఛార్జీలు పూర్తిగా మినహాయింపు
10. జీఎస్టీ మినహాయించిన తర్వాత సబ్ లార్జ్, ఆపై పెట్టుబడులు పెట్టే సంస్థలకు చెల్లించే ప్రోత్సాహకాలు ఎఫ్‌సీఐ మొత్తానికి మించకుండా ఉండాలి.
ఛార్జింగ్/ స్వాపింగ్ ఆపరేటర్లకు మద్దతు
నెడ్‌క్యాప్ కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాల ఎంపిక
మొదటిగా 5 వేల ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే వారికి ఖర్చులో 25 శాతం రాయితీని అందిస్తారు.
ఛార్జింగ్ కేంద్రాలకు టైమ్ ఆఫ్ డే విధానం
వినియోగదారుల నుంచి మాగ్జిమం సీలింగ్ టారిఫ్ కింద యూనిట్‌కు రూ.15 చొప్పున వసూలు
ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీ నిబంధనలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు వర్తింపు
రీసైక్లింగ్, స్క్రాపింగ్ సదుపాయాలు, ఏటీఎస్ ఆపరేటర్లకు మద్దతు అందించేలా ప్రత్యేక ప్రోత్సాహకాలు
కంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో వీటికి తిరుగేలేదు.. అమేజ్ vs డిజైర్.. ఈ రెండింటిలో బెస్ట్ ఇదే..!
స్టైలిష్ లుక్, అడ్వాన్స్డ్ ఫీచర్స్.. బజాజ్ న్యూ చేతక్ ఈవీ వచ్చేస్తోందోచ్..!
న్యూ డిజైన్‌తో రియల్మీ కొత్త స్మార్ట్‌ఫోన్- బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!