ETV Bharat / state

పేరుకే బహుళ ప్రయోజనాల ప్రాజెక్టు - నేటికీ పూర్తిస్థాయిలో నెరవేరని లక్ష్యాలు - PULICHINTALA PROJECT

రెండు దశాబ్దాలు గడిచినా పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నేటికీ అందుబాటులోకి రాలేదు.

PULICHINTALA PROJECT IN Andhra Pradesh
Pulichintala @ 20 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2024, 12:53 PM IST

Pulichintala @ 20 : కృష్ణా డెల్టా రైతుల వరప్రదాయిని కె.ఎల్.రావు సాగర్ పులి చింతల ప్రాజెక్టుకి పునాది రాయి వేసి 20 ఏళ్ళు గడిచింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలోని 13 లక్షల ఆయకట్టు స్థిరీకరణ, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, చేపల పెంపకం తదితర బహుళ ప్రయోజనాలతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. బ్రిటిష్ కాలం నుంచి ఈ ప్రతిపాదన ఉంది. 1988 నవంబరు 18న ప్రస్తుత సూర్యాపేట జిల్లా వజినేపల్లి వద్ద అప్పటి సీఎం ఎన్టీ రామారావు పులిచింతల కర్షక పేరుతో శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అప్పటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మరికొందరు మావోయిస్టులు దీనిని అడ్డుకోవడంతో ఇది మరుగున పడింది. 2004 అక్టోబరు 15న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. తొలుత రూ 631 కోట్ల అంచనాతో నిర్మాణాన్ని గుత్తేదారు సంస్థ చేపట్టింది. తరువాత 2022 మార్చి వరకు 2,010 కోట్లు ఖర్చు చేశారు. 2013 డిసెంబర్ 7న అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. రెండు దశాబ్దాలు గడిచిన ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నేటికీ అందుబాటులోకి రాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో పలు పనులు మందకొడిగా సాగాయి.

PRATHIDWANI: రాష్ట్రంలో సాగునీటి ‌ప్రాజెక్టుల నిర్వహణ ఎందుకు లోపభూయిష్టంగా మారింది?

2014 నుంచి నీటి నిల్వ: జలాశయంలో 2014 నుంచి దశల వారీగా నీటి నిల్వ ప్రారంభించారు. 2019, 2020, 2021 2024 సంవత్సరాల్లో ప్రాజెక్టుల్లో 45.77 పూర్తిస్థాయి టీఎంసీల నీటిని నిల్వ చేశారు. 2021 ఆగస్టు 5న 16వ నెెంబర్ గేటు విరిగి నదిలో కొట్టుకుపోయింది. దాంతో 2023లో మరో కొత్త గేటును అమర్చారు. 20 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో దీన్ని డిజైన్ చేయగా 2020 అక్టోబరు 10న ప్రాజెక్టు నుంచి అత్యధికంగా 8.6 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వాటి వివరాలను కింద ఇచ్చిన గణాంకాల ఆధారంగా చూడవచ్చు.

ప్రాజెక్ట్ విశేషాలివి: ప్రాజెక్టు కాంక్రీట్ కట్టడం పొడవు: 934 మీటర్లు

మట్టి ఆనకట్ట పొడవు: 355 మీటర్లు

రేడియల్ గేట్లు: 24

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 45.77 టీఎంసీలు

ముంపు గ్రామాలు: 26

పునరావాస కేంద్రాలు: 30

నిర్వాసిత కుటుంబాలు : 13259

చేపట్టవలసిన పనులు ఇవే.. ప్రాజెక్టు కుడి వైపు (పల్నాడు జిల్లా) రూ.5.80 కోట్లతో 2001 జూలైలో ప్రారంభించిన శాశ్వత కంట్రోల్ రూమ్ తోపాటు కార్యాలయం అతిథి గృహ భవన నిర్మాణం పునాది స్థాయి దాటలేదు. ఇంజినీర్లు, సిబ్బంది గేట్ల నిర్వహణ పర్యవేక్షణ సిబ్బంది కూర్చొనేందుకు కూడా చోటు లేదు. రూ.67 కోట్లతో ప్రాజెక్టుకు అనుసంధానంగా పల్నాడు జిల్లా వైపు మాదిపాడు వరకు నిర్మించాల్సిన నాలుగు కిలోమీటర్ల అనుబంధ రహదారి అంచనాలకే పరిమితమైంది. ప్రాజెక్టు దిగువ భాగంలో రిటైనింగ్ వాల్ నిర్మించారు. మధ్య ఖాళీ ప్రదేశాన్ని గ్రావెల్​తో నింపి పార్క్ సుందరీకరణ, పలువురి కాంస్య విగ్రహాల ఏర్పాటు ప్రతిపాదనకే పరిమితమైంది. వాక్​ వే వంతెన నిర్మాణం ఇంకా 7 గేట్ల పరిధిలో జరగాల్సి ఉంది. రూ.7. 42 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన సీసీ ఆప్రాన్ నిర్మాణం చేపట్టలేదు. ఇప్పటికీ ముంపు బాధితులకు పరిహారం చెల్లించలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారిన వారి గోడు వినే వారే కనిపించడం లేదు.

గత పదేళ్లలో నీటి ప్రవాహం ఇలా.. (టీఎంసీలలో)

సంవత్సరం ఇన్ ఫ్లో అవుట్ ప్లో

2014-15 214.51 218.90

2015-16 24,912 27,605

2016-17 144.35 141.00

2017-18 59.87 59.99

2018-19 65.87 66.16

2019-20 961.43 957.03

2020-21 1127.88 1120.20

2021-22 574.59 554.13

2022-23 1313.64 1309.05

2023-24 562.53 551.72

వైసీపీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్ట్‌లు - మరమ్మతులు లేక కొట్టుకుపోతున్న గేట్లు

Pulichintala Project: నెలలు..సంవత్సరాలు గడిచాయి.. కొట్టుకుపోయిన గేటును పెట్టలేకపోయారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.