Telangana Summer Holidays 2024 List: సంవత్సరం పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మరో నాలుగు రోజుల తర్వాత నుంచి సమ్మర్ హాలీడేస్ స్టార్ట్ కాబోతుండడంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు. మరి, ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హాలీడేస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగనున్నాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
రోజురోజుకూ పెరుగుతోన్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. మార్చి 15 నుంచి తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్ ప్రారంభం కాగా.. ఏప్రిల్ 23తో ఇవి ముగియనున్నాయి. ఏప్రిల్ 23వ తారీఖే రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌కి లాస్ట్ వర్కింగ్ డే. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ఓపెన్ కానున్నాయి. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. దీంతో స్కూల్స్‌కు నెలన్నరకు పైగా వేసవి సెలవులు ఉండనున్నాయి.
ఇంటర్ కాలేజీల విషయానికొస్తే.. ఇంటర్ పరీక్షలు పూర్తైన నేపథ్యంలో మార్చి 30 వ తేదీ నుంచే కాలేజీలకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు మార్చి 30 నుంచి మే 31 వరకు కొనసాగుతాయి. అంటే సుమారుగా రెండు నెలలు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు. జూన్ 1న కాలేజీలు రీఓపెన్ కానున్నాయి.
మధ్యాహ్నం రోడ్డెక్కుతున్నారా? - అవస్థలు ఖాయం! - adjustment of buses in hyderabad
ఇదే జరిగితే సెలవులు పొడిగింపు: ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మే నెల రాకముండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇదే పరిస్థితి జూన్ మూడో వారం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో జూన్ మూడో వారం వరకు ఎండల తీవత్ర కొనసాగితే స్కూల్స్‌కు సమ్మర్ హలీడేస్ను పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే జూన్ 11 వరకు ఈ వేసవి సెలవులు కొనసాగుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈసారి ఏపీలోని స్కూల్స్‌కి వేసవి సెలవులు దాదాపుగా 50 రోజులు ఉండనున్నాయి. ఇప్పటికే ఇంటర్ కాలేజీ విద్యార్థులకు సెలవులు ప్రారంభం కావడంతో.. ఈ హాలీడేస్ మే 31 వరకు ఉండనున్నాయి. జూన్ 1 నుంచి కాలేజీలు రీ ఓపెన్ కానున్నాయి.