ETV Bharat / state

ఇంటి వద్దకే టీజీఎస్​ఆర్టీసీ కార్గో సేవలు - ఎప్పటినుంచి ప్రారంభం తెలుసా? - TGSRTC Cargo Door Delivery

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 7:22 AM IST

Updated : Aug 16, 2024, 8:10 AM IST

TGSRTC on Cargo Services : సరకు రవాణాలోనూ ఆర్టీసీ తన వాటా పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఖర్చులకు తగినట్లు అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. వందలాది బస్ డిపోలతో విస్తృత నెట్​వర్క్ కలిగిన ఆర్టీసీ ఇప్పటికే కార్గో సేవల ద్వారా మంచి ఆదాయాన్నే పొందుతోంది. ఆ రంగంలోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇంటి నుంచే పికప్ చేసుకుని హోం డెలివరీ ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో అమలు చేసి ఫలితాలు బాగుంటే అన్ని ప్రాంతాలను విస్తరించాలని యోచిస్తోంది.

TGSRTC Door Delivery Cargo Services
TGSRTC on Cargo Services (ETV Bharat)

TGSRTC Door Delivery Cargo Services : కొన్నేళ్ల కిందటే టీజీఎస్​ఆర్టీసీ సరకు రవాణా సేవలు ప్రారంభించి కార్గో సేవల ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతోంది. ప్రభుత్వ రంగ కార్పొరేషన్ కావడం, విస్తృత నెట్​వర్క్ ఉండటంతో దీనికి భారీగానే స్పందన వచ్చింది. ఈ సేవల్ని మరింత విస్తరించి ఏటా అదనంగా రూ. 300 కోట్లు ఆదాయం సంపాదించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో కార్గో బుకింగ్ కోసం ఆర్టీసీలో ప్రత్యేక వ్యవస్థ ఉంది.

పెద్ద మొత్తంలో బుకింగ్ ఉన్నప్పుడు వారి నుంచి నేరుగా సరుకులు తీసుకుని రవాణా చేస్తోంది. అయితే డెలివరీ మాత్రం హైదరాబాద్ లాంటి మహా నగరంలో జేబీఎస్, సీబీఎస్, ఉప్పల్ ప్రాంతాల్లో మాత్రమే ఉంది. మిగతా పట్టణాల్లో కేవలం బస్టాండ్‌లలో మాత్రమే డెలివరీ తీసుకోవాలి. దీనివల్ల చాలా మంది కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై దృష్టి సారించిన ఆర్టీసీ వినియోగదారుల చెంతకే వస్తువుల్ని డెలివరీ చేయాలని ప్రణాళికలు వేసింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఇంటి నుంచే పికప్ చేసుకోవాలని కూడా ఆలోచిస్తోంది.

పికప్ టూ హోం డెలివరీకి ప్రతిపాదనలు సిద్ధం : మొదట హైదరాబాద్ నగరంలో వెయ్యి చోట్ల ఈ సేవలు ప్రారంభించి ఫలితాల ఆధారంగా ఇతర ప్రాంతాల్లో ప్రారంభించాలని చూస్తోంది. ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రతి పండుగలకు వినూత్న పద్ధతిలో సేవలను అందిస్తుంటుంది. ఈ రకంగానే ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా టీజీఎస్​ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కార్గో సేవలు అందిస్తున్న డిపోల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

సుదూర ప్రాంతాల్లో ఉన్న అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టలేని వారు ఈ సర్వీస్ ద్వారా వారికి రాఖీని చేరవేయవచ్చు. ఇలా ఆర్టీసీ ప్రతి సందర్భంలోనే ప్రత్యేక అవకాశాన్ని కల్పించుకుని సేవలను ప్రజలకు దగ్గర చేస్తోంది. డోర్ డెలివరీ, పికప్ సేవలు ప్రారంభిస్తే సంస్థకున్న అపార నెట్‌వర్క్ వల్ల ఆ రంగంలో లీడర్‌గా ఎదిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

'పికప్ చేసుకుని హోం డెలివరీ చేసేందుకు ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం బాగుంది. ఈ కార్గో సేవలు తొందరగా తీసుకొస్తే బాగుంటుంది. దీని వల్ల ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఆర్టీసీ కార్గో సేవలు ఛార్జీలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటే మరింత ఆదరణ పొందుతుంది. ప్రైవేట్​ సర్వీసుల కంటే ఆర్టీసీ మెరుగ్గా సేవలు చేస్తోంది'-వినియోగదారులు

కార్గో లాజిస్టిక్స్​పై దృష్టి సారించిన టీఎస్​ఆర్టీసీ - అత్యాధునిక సేవలు విస్తరించేలా ప్రణాళికలు

కార్గో సేవలకు అనూహ్య స్పందన - ఆర్టీసీకి భారీగా పెరుగుతున్న ఆదాయం

Last Updated : Aug 16, 2024, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.