Special Buses For Fish Prasadam Distribution 2024 : మృగశిర కార్తె వచ్చిందంటే హైదరాబాద్ వాసుల్లో మొదటగా మెదిలేది చేపమందు పంపిణీ. ప్రతి ఏడాది ఈ మాసంలో ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబం తరతరాలుగా చేప ప్రసాదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది మాదిరి ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీకి వారు రంగం సిద్ధం చేస్తున్నారు. మరో రెండ్రోజుల్లో జూన్ 8వ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ చేపమందును అందించనున్నారు.
బత్తిని బ్రదర్స్ పంపిణీ చేసే ఈ చేప ప్రసాదం కోసం కేవలం హైదరాబాద్ నుంచే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి జనం వస్తుంటారు. అంతేకాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా పేషెంట్స్ నగరానికి ఒక రోజు ముందుగానే చేరుకుంటారు. ఈ క్రమంలో చేప ప్రసాదం కోసం వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది.
Fish Prasadam Distribution 2024 : జూన్ 8, 9వ తేదీల్లో హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ చేయనున్నారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నవారు వస్తుంటారు. కొంతమందైతే రెండు రోజుల ముందే వచ్చి అక్కడ బస చేస్తుంటారు. మందు తమకు దొరుకుతుందా లేదోనని ముందే వచ్చేస్తుంటారు.
Chepa Mandu Distribution : అస్తమా పేషెంట్స్‌కు అలర్ట్.. మరో రెండ్రోజుల్లో చేప ప్రసాదం పంపిణీ
ఈ రూట్లల్లో బస్సులు : ఇలాంటి వారికోసమే ఈనెల 8, 9 తేదీల్లో 130 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు అయిన జూబ్లీహిల్స్, ఎంజీబీఎస్ నుంచి, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే దగ్గరలోని బస్‌స్టాండులో కనుక్కోవాలని సూచించింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 9 బస్సులు, కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి 7, జేబీఎస్ బస్టాండ్ నుంచి 9, ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి 9, ఈసీఐఎల్ క్రాస్ రోడ్ నుంచి 9, శంషాబాద్ విమానాశ్రయం నుంచి 7 బస్సులను నడిపిస్తున్నారు. వీటితో పాటు దిల్సుఖ్నగర్, ఎన్జీఓస్ కాలనీ, మిథాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రాంనగర్, రాజేంద్రనగర్, రిసాల్ బజార్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, పటాన్చెరు, జీడిమెట్ల, కేపీహెచ్‌బీ కాలనీ, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు మొత్తం 80 బస్సులు ఏర్పాటు చేశారు.
ఆస్తమా పేషెంట్స్‌కు అలర్ట్ - చేప ప్రసాదం పంపిణీ డేట్స్ ఫిక్స్ - ఎప్పుడంటే? - Chepa Mandu dates 2024