ETV Bharat / state

ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న షాకింగ్ విషయాలు - టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు తరలింపు - TS Phone Tapping Case - TS PHONE TAPPING CASE

Telangana Phone Tapping Case Updates : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రోజుకో బండారం బయట పడుతోంది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి-ఎస్‌ఐబీలో సమాచార ధ్వంసంపై మొదలైన దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ మలుపులు తిరుగుతోంది. తాజాగా టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావును అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లోనే రాధాకిషన్‌రావు డబ్బు తరలింపు చేపట్టినట్లు పోలీసులు గుర్తించారు.

Telangana Phone Tapping Case Updates
Telangana Phone Tapping Case Updates
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 8:05 AM IST

Updated : Mar 30, 2024, 8:41 AM IST

టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు విచారణలో విస్తుపోయే విషయాలు

Telangana Phone Tapping Case Updates : ఫోన్‌ ట్యాపింగ్ కేసులో తాజాగా అరెస్టైన హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. గత నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన ఆగడాలు పతాకస్థాయికి చేరాయి. ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. సదరు పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం తన బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లోనే డబ్బులు తరలించారు.

Election Money Transported in Task Force Vehicles : హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతాల్లోని సదరు పార్టీ అభ్యర్థులకు డబ్బు పంపడంలో రాధాకిషన్‌రావు బృందం కీలకంగా వ్యవహరించింది. ఇందుకోసం పోలీసు వాహనాలైతే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడ అమలు చేశారు. ఈ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల్లో కొందరిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. త్వరలోనే మరికొందరి అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాలు ఇమిడి ఉండటంతో ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్టును చేర్చనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆధారాల ధ్వంసం సెక్షన్లు మాత్రమే ఉండటంతో పోలీసులు ఈ దిశగా ఆలోచన చేస్తున్నారు.

సొంత అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ - ప్రణీత్ టీమ్ ప్రైవేట్ దందా మామూలుగా లేదుగా! - Telangana Phone Tapping Case

Task Force EX OSD Radhakishan Rao Arrest Updates :రాధాకిషన్‌రావును శుక్రవారం సుదీర్ఘంగా పోలీసులు విచారించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాక కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లగా 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్ విధించారు. అక్కడినుంచి ఆయణ్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. రాధాకిషన్‌రావును పోలీసు కస్టడీకి తీసుకునేందుకు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైళ్లు రూపొందించి అక్రమంగా పర్యవేక్షించడంతోపాటు ఎన్నికల సమయంలో అక్రమంగా నగదు తరలింపులో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

రాధాకిషన్‌రావు బృందం ప్రధాన పార్టీ నాయకులపై పోటీచేసే ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంలోనూ కీలకంగా వ్యవహరించింది. దీని కోసం ముందుగా పలువురు నేతలు, వ్యాపారుల ప్రొఫైళ్లు రూపొందించి ఎస్‌ఐబీ కార్యాలయంలో ప్రణీత్‌రావుకు ఇచ్చేవారు. అతను వారి కదలికలు, కార్యకలాపాలపై సాంకేతిక సాయంతో రహస్యంగా సమాచారం సేకరించి తిరిగి ఆయనకు చేరవేసేవారు. దీని ఆధారంగా రాధాకిషన్‌రావు బృందం (TS Phone Tapping Case)క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు చేపట్టి ప్రధాన పార్టీ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంపై దృష్టి సారించింది.

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కీలక మలుపు - ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్ - PRANEETH RAO CASE updates

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన భుజంగరావు సైతం అదే పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రైవేట్ ప్రొఫైళ్లు రూపొందించినట్లు దర్యాప్తులో బహిర్గతమైంది. భువనగిరిలో ఏసీపీగా ఉన్న భుజంగరావు అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. అనంతరం తొలుత అనిశాకు బదిలీ అయ్యారు. అయితే అతను విధుల్లో చేరక ముందే ఇంటెలిజెన్స్‌లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్కడ పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తూ ప్రైవేట్ ప్రొఫైళ్లను ప్రణీత్‌రావుకు అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

పోలీసుల కస్టడీకి అదనపు ఎస్పీలు : చంచల్‌గూడ జైల్లో జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను హైదరాబాద్‌ పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 11:00 గంటల సమయంలో జైలు నుంచి తరలించారు. తొలి రోజు వీరిని పెద్దగా విచారించలేదని తెలిసింది. మరోవైపు అదుపులోకి తీసుకున్న రాచకొండ ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు నుంచి వాంగ్మూలం తీసుకున్న అనంతరం వదిలేశారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నమ్మలేని నిజాలు - నల్గొండలో వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసి మరీ బెదిరింపులు! - PHONE TAPPING CASE latest upadates

'రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టారు' - Telangana Phone Tapping Case Update

Last Updated : Mar 30, 2024, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.