ETV Bharat / state

సవాళ్లతో హీటెక్కిన తెలంగాణ - పాడి కౌశిక్​రెడ్డి Vs అరెకపూడి గాంధీ - Kaushik Reddy Vs Arekapudi Gandhi

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2024, 5:23 PM IST

Kaushik Reddy Vs Arekapudi Gandhi: తెలంగాణ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. కౌశిక్ సవాల్ స్వీకరించిన గాంధీ తన అనుచరులతో కలిసి హైదరాబాద్ కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Kaushik Reddy Vs Arekapudi Gandhi
Kaushik Reddy Vs Arekapudi Gandhi (ETV Bharat)

Kaushik Reddy Vs Arekapudi Gandhi: కౌశిక్‌రెడ్డి దొంగ అని గమనించకుండా పార్టీలో స్థానం ఇచ్చారని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బీఆర్‌ఎస్‌లోకి వచ్చినప్పటి నుంచి ఆయన తీరు సరిగాలేదని పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డి తీరు వల్లనే బీఆర్‌ఎస్‌ ఓటమి చెందిందని ఆరోపించారు. అతను కోవర్టుగా వ్యవహరించారని, అంతే కాకుండా ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని అరికెపూడి గాంధీ ధ్వజమెత్తారు. కౌశిక్ సవాల్‌ను స్వీకరించిన అరికెపూడి కొండాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు.

‘మీ ఇంటికొస్తా, జెండా ఎగరేస్తా అంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అరెకపూడి గాంధీ తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డి రాకపోతే తానే స్వయంగా అతడి ఇంటికి వెళ్తానని సవాల్ చేసిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే తన అనుచరులతో కలిసి అరెకపూడి గాంధీ కౌశిక్ ఇంటికి వెళ్లారు. అప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

అనంతరం కౌశిక్‌రెడ్డి ఇంటివద్ద తన అనుచరులతో కలిసి అరెకపూడి గాంధీ బైఠాయించగా, పోలీసులు అతనిని పంపించే ప్రయత్నం చేశారు. కౌశిక్‌రెడ్డిని బయటకు పిలవాలని, లేదంటే తననే లోపలికి పంపించాలని అరెకపూడి గాంధీ డిమాండ్‌ చేశారు. కౌశిక్ ఇంటి వద్ద బైఠాయించి అరెకపూడి అనుచరులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అరెకపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. కొందరు అనుచరులు గేటు తోసుకుంటూ కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లారు. అనంతరం అరెకపూడి గాంధీని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరోవైపు ఈ ఘటనపై కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదని అన్నారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. తనను హత్య చేయడానికి తన ఇంటి వద్దకు వచ్చారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం (సెప్టెంబరు 13వ తేదీ) 11 గంటలకు బీఆర్‌ఎస్‌ తడాఖా చూపిస్తామంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ అరెకపూడి గాంధీ చేసిన చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. అరెకపూడి గాంధీ కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చారని, తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డనని కౌశిక్ రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్​పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు- స్పీకర్​ కార్యాలయానికి ఆదేశాలు - MLAS DISQUALIFICATION CASE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.