TG DSC Hall Tickets 2024 : తెలంగాణలో నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షకు హాల్‌టికెట్లు ఈనెల 11వ తేదీ సాయంత్రం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవల విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటించింది.
డీఎస్సీ హాల్‌టికెట్లను www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న మొత్తం 11,062 పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్చ్ 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించిన విద్యాశాఖ, ఈ నెల 18 నుంచి సీబీటీ బేసిడ్ టెస్ట్ నిర్వహించనుంది.
TJS Chief Kodandaram React on DSC Issue : పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లామని టీజేఎస్ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం తెలిపారు. కమిషన్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి అన్ని విషయాలను సీరియస్‌గా విన్నారని, విద్యార్థుల అవేదన, ఆందోళన గురించి వివరించామని చెప్పారు.
ఈ క్రమంలోనే గ్రూపు-1 జాబ్స్ కోసం 1:100 నిష్పత్తిలో పిలవాలని కోరామని వెల్లడించారు. డీఎస్సీ, గ్రూపు -2 మధ్య సమయం తక్కువగా ఉందని, డీఎస్సీని, గ్రూపు-2ని వాయిదా వేసి ఈ రెండు పరీక్షల మధ్య కొంత వ్యవధి ఉంటే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని వివరించినట్లు కోదండరాం పేర్కొన్నారు. మహేందర్ రెడ్డి అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు.
DSC Aspirants Protest in Hyderabad : మరోవైపు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ, సోమవారం డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎదుట ఆందోళన చేపట్టిన అభ్యర్థులను, హైదరాబాద్‌లోని పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు తరలించారు. రాత్రి అవుతున్నా విడుదల చేయకుండా, కనీసం తాగేందుకు నీరు కూడా ఇవ్వకుండా ఇబ్బందలకు గురిచేస్తున్నారంటూ అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. అనంతరం వారిని 9గంటల సమయంలో విడిచిపెట్టారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ అక్కడికి చేరుకోగా, స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పోలీసులు క్రిషాంక్‌కు నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించి వేశారు. అనంతరం డీఎస్సీ అభ్యర్ధులు ర్యాలీగా ఉస్మానియా యూనివర్సిటికి వెళ్లారు. ఆర్స్ట్ కళాశాల వద్ద, అర్ధరాత్రి వరకు శాంతియుత నిరసన చేపట్టారు. విద్యార్ధులకు మద్దతుగా బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండటమే కాకుండా విద్యార్ధులు భవిష్యత్తుతో ఆడుకుంటుందని విద్యార్థి సంఘ నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు ఆరోపించారు.
డీఎస్సీ పరీక్షలు యథాతథం - ఈ నెల 11న హాల్‌టికెట్లు విడుదల : విద్యాశాఖ - TG DSC As Per Schedule