Telangana DSC Hall Tickets Release Today : తెలంగాణ డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులకు అలర్ట్. డీఎస్సీ హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచింది. ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది.
డీఎస్సీ హాల్‌టికెట్లను www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న మొత్తం 11,062 పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ మార్చ్ 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. నేడు వెబ్సైట్లో హాల్‌టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 18 నుంచి సీబీటీ బేసిడ్ టెస్ట్ నిర్వహించనుంది. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.
డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఇదే..
- జులై 18 న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష
- జులై 18 సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష
- జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
- జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
- జులై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
- జులై 23 న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
- జులై 24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్ పరీక్ష
- జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
- జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం - TET Schedule Released
DSC Aspirants Protest : మరోవైపు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ, డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ ముట్టడి, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించారు. కానీ, ప్రభుత్వం మాత్రం డీఎస్సీని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి వెబ్సైట్లో హాల్‌టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది.
మద్దతు తెలిపిన బీఆర్ఎస్ : డీఎస్సీని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోచింగ్ సెంటర్ల యజమానులు తమ వ్యాపారం కోసం పరీక్షలు వాయిదా వేయాలని తనను కలిశారని తెలిపారు. విద్యార్థుల చావులతో బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.