ETV Bharat / state

లోక్‌సభ ఎన్నికలు 2024 - తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు ప్రకటించిన కాంగ్రెస్‌

Telangana Congress Lok Sabha Candidates First List 2024 : లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. 39 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించగా, తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇంకా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

congress Loksabha candidates
congress Loksabha candidates
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 9:30 PM IST

Telangana Congress Lok Sabha Candidates First List 2024 : కాంగ్రెస్‌ పార్టీ 39 మందితో లోక్​సభ అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెంది నాలుగు పార్లమెంటు స్థానాలకు (Lok Sabha Polls 2024) అభ్యర్థులను ప్రకటించింది. జహీరాబాద్‌ నుంచి సురేష్‌కుమార్‌ షెట్కర్‌, నల్గొండ నుంచి రఘువీర్‌ కుందూరు, మహబూబ్‌ నగర్‌ నుంచి వంశీచంద్‌ రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌ల పేర్లను మొదటి జాబితాలో ప్రకటిచింది.

జహీరాబాద్‌ నుంచి సురేష్‌ కుమార్‌ షెట్కర్‌కు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన హామీ మేరకు ఆయన పేరును అధిష్ఠానం ప్రకటించింది. అదేవిధంగా నల్గొండ నుంచి సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘవీర్‌కు అవకాశం కల్పించారు. ఏఐసీసీ కార్యదర్శి, మహబూబ్‌ నగర్‌ నుంచి పోటీ చేస్తారని గతంలో కొస్గిలో జరిగిన సభలోనే వంశీచంద్‌ రెడ్డిని స్వయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డినే బహిరంగ సభలో ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌కు కూడా ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకు ఆయనకు టికెట్ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

మళ్లీ వయనాడ్ నుంచే రాహుల్ పోటీ- మరి యూపీ సంగతేంటి?

Loksabha Election 2024 Congress First List : కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌, AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌ సహా 39 మంది పేర్లతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసింది. 39స్థానాలకు ఖరారైన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌. గురువారం సమావేశమైన కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ పేర్లను ఖరారు చేసినట్లు చెప్పారు. తాము ఎన్నికల మూడ్​లో ఉన్నామని, ప్రచారంలో దూకుడు పెంచుతామని చెప్పారు.

రాహుల్‌ మరోసారి కేరళలోని వయనాడ్‌ నుంచి, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్‌ తిరువనంతపురం నుంచి పోటీ చేయనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార‌్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కేరళలోని అళప్పుజ నుంచి, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌ రాజ్‌నంద్‌గావ్‌ నుంచి లోక్‌సభ బరిలో నిలవనున్నారు. ఈ తొలి జాబితాలో ప్రకటించిన 39 మందిలో 15 మంది జనరల్‌, 24 మంది ఎస్​సీ/ఎస్​టీ/ఓబీసీ/మైనార్టీ కేటగిరీకి చెందినవారు ఉన్నట్లు వేణుగోపాల్‌ తెలిపారు. తొలి జాబితాలో 12 మంది అభ్యర్థులు 50 ఏళ్లు లోపువారే ఉన్నారు. అయితే, ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల పేర్లను ఇంకా వెల్లడించలేదు. కాగా, గతవారం భారతీయ జనతా పార్టీ 195మంది పేర్లతో తొలిజాబితా విడుదల చేసింది.

'రూ.210 కోట్లు ఫైన్​ తప్పదు- బ్యాంక్ అకౌంట్లు బ్లాక్​!'- కాంగ్రెస్​ బిగ్ షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.