ETV Bharat / state

​సభలో వ్యూహంపై చంద్రబాబు దిశానిర్దేశం- టీడీపీ పార్లమెంటరీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలు - TDP Parliamentary Party Meeting

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 7:03 AM IST

TDP Parliamentary Party Meeting: వైఎస్సార్సీపీ పాలనలో అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో ఎంపీలు కీలకపాత్ర పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాలని టీడీపీ ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు. అమరావతి, పోలవరం సహా విభజన హామీల్ని సాధించడంతో పాటు ప్రతి ఎంపీ కనీసం రెండు శాఖలపై దృష్టిపెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేయాలని బాధ్యతలు అప్పగించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలను నియమించారు.

TDP Parliamentary Party Meeting
TDP Parliamentary Party Meeting (ETV Bharat)

​సభలో వ్యూహంపై చంద్రబాబు దిశానిర్దేశం- టీడీపీ పార్లమెంటరీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలు (ETV Bharat)

TDP Parliamentary Party Meeting: రాష్ట్రాభివృద్ధే అందరి ప్రథమ కర్తవ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం ఎంపీలకు సూచించారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు, పథకాలు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న లోక్‌సభలో లేవనెత్తాల్సిన, ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన విధివిధానాల్ని వారికి వివరించారు.

అమరావతి నిర్మాణానికి పొలం అమ్మి 25 లక్షలు విరాళంగా ఇచ్చిన వైద్య విద్యార్థిని వైష్ణవికి ఉన్న శ్రద్ధ కూడా మాజీ సీఎం జగన్‌కు లేదని మండిపడ్డారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లుగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్‌రావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని, కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని నియమించారు. పార్లమెంటరీ విప్‌గా గంటి హరీష్‌ను ఎంపిక చేశారు.

ఈ సారి లోక్‌సభలో తెలుగుదేశం సంఖ్యాబలం పెరిగినందున 16 మంది ఎంపీలు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని దేశానికి తెలియజేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎక్కువ నిధులు, మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. ప్రతి ఎంపీ కేంద్రంలో ఒకటి రెండు శాఖలపై దృష్టిపెట్టి, రాష్ట్రంలోనూ అవే శాఖల్ని సమన్వయం చేసుకోవాలని సూచించారు. కేంద్ర పథకాల్ని, నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు.

దేవుడి స్క్రిప్ట్​తోనే వైఎస్సార్​సీపీ 11 సీట్లు- పిరికితనంతో జగన్ పారిపోయాడు: చంద్రబాబు - CM Chandrababu on YSRCP

అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కృషి చేయాలని చంద్రబాబు తెలిపారు. ఈ అయిదేళ్లలో రాష్ట్రంలో రహదారులు అధ్వాన్నంగా మారాయని, జగన్‌ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క కి.మీ కూడా రహదారి వేయలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ నిధులతో రికార్డు స్థాయిలో రహదారులు నిర్మించామని, కేంద్ర పథకాల్ని సద్వినియోగం చేసుకొని పేదలకు గృహ నిర్మాణం సాకారం చేసినట్టు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా రహదారులు, ఇళ్ల నిర్మాణానికి కృషి చేయాలన్నారు.

రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులు, పొరుగు రాష్ట్రాలతో అనుసంధానమై ఉన్న మార్గల అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయ విధానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని గుర్తుచేశారు. గతంలో మనం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించామని, సంబంధిత కేంద్ర పథకాల్ని ఇప్పుడూ మనం వినియోగించుకోవాలని చంద్రబాబు స్పష్టంచేశారు.

పార్లమెంటరీ సమావేశాల సందర్భంగా దిల్లీకి రావాలని చంద్రబాబును కొందరు ఎంపీలు ఆహ్వానించగా తన గొంతుక ఎంపీలే కాబట్టి, మీరే మాట్లాడండి అని చంద్రబాబు అన్నారు. భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి, రాష్ట్రంలోని పలు విమానాశ్రయాల నుంచి దేశవిదేశాలకు కొత్త సర్వీసులు నడపటం సహా కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కసరత్తు ప్రారంభించినట్టు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చంద్రబాబుకు తెలిపారు. గతంలో జగన్‌, చంద్రబాబు సహా టీడీపీ నేతలకు చేసిన అవమానాల్ని, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వారితో హుందాగా వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారని కొందరు ఎంపీలు సమావేశంలో ప్రస్తావించారు.

జనవాణికి వచ్చే సమస్యల పరిష్కారాలను నేరుగా పర్యవేక్షిస్తోన్న డిప్యూటీ సీఎం పవన్ - Pawan Kalyan Janavani

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.