TDP Nara Lokesh Sankharavam Election Campaign in Icchapuram: నేటి నుంచి శంఖారావం పేరిట తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా లోకేశ్ ప్రణాళికలు రూపొందించారు. నారా లోకేశ్ శంఖారావం ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం కానుంది.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నేడు జరగనున్న నారా లోకేశ్ శంఖారావం సభకు సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణంలోని సురంగి రాజావారి మైదానంలో జరగనున్న శంఖారావసభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సభను విజయవంతం చేయాలని టీడీపీ అభిమానులు, కార్యకర్తలను ఎమ్మెల్యే అశోక్ కోరారు.
నారా లోకేశ్ శంఖారావం - ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం
Shankharavam Program Start From Sunday: రాష్ట్రవ్యాప్తంగా శంఖారావం కార్యక్రమానికి లోకేశ్ సారథ్యం వహిస్తారు. ప్రతి రోజూ 3 నియోజకవర్గాల చొప్పున దాదాపు 50 రోజుల పాటు శంఖారావం పర్యటన సాగుతుందని టీడీపీ నేతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో శంఖారావం తొలిసభ జరుగుతుందన్నారు. అదే రోజు పలాస, టెక్కలిలోనూ కొనసాగనుంది. 12వ తేదీన నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలసల్లో లోకేశ్ పర్యటిస్తారు. 13వ తేదీన పాతపట్నం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. లోకేశ్ పర్యటన తొలిదశలో 11 రోజుల పాటు 31 నియోజకవర్గాల్లో జరిగేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. జగన్ పాలనలో మోసపోయిన యువత, మహిళలు, ఇతర అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా శంఖారావం సాగుతుందని వెల్లడించారు. నిర్ణీత రూట్ మ్యాప్ ప్రకారం ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆయా నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి కేడర్‌తో లోకేశ్ సమావేశమవుతారు.
యువగళాన్ని నవశకం వైపు నడిపిన అందరికీ కృతజ్ఞతలు - ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటా : నారా లోకేశ్
యువగళం: గత ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాలను ఏకం చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చింది. అధికారపార్టీ పెద్దల అవినీతి, దౌర్జనాలను ఎండగడుతూ 226 రోజుల పాటు 3132 కి.మీ.ల మేర, 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2197 గ్రామాల మీదుగా సాగింది. ఈ యాత్ర ద్వారా సుమారు కోటి మంది ప్రజలను నారా లోకేశ్ నేరుగా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకున్నారు. ఉత్తరాంధ్రలో కూడా యువగళం పాదయాత్ర కొనసాగాల్సి ఉన్నప్పటికీ చంద్రబాబు అరెస్టు కారణంగా 79 రోజులపాటు యాత్రకు విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఎన్నికలు ముంచుకొస్తున్నందున విశాఖపట్నం పరిధిలోని అగనంపూడి వద్ద డిసెంబర్ 18వ తేదీన లోకేశ్ యువగళం పాదయాత్రను అనివార్యంగా ముగించారు. యువగళం ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద నవశకం పేరుతో నిర్వహించిన బహిరంగసభ చరిత్ర సృష్టించింది.
నారా లోకేశ్ యువగళం విజయోత్సవ సభకు సర్కారు ఆంక్షలు - విజయవంతం చేస్తామని నేతలు ధీమా