ETV Bharat / state

వైఎస్సార్సీపీ పాలనలో పేదలు మరింతగా చితికిపోయారు - జగన్​రెడ్డి కులపిచ్చి పరాకాష్టకు చేరింది - Yanamala Rama Krishnudu

TDP Leaders Fired on Jagan Government: రాష్ట్ర ప్రజలపై జగన్ సర్కార్ చూపిస్తున్న పక్షపాత వైఖరిపై పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముంగిట వెనుకబడిన వర్గాలను వంచించడానికే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతో బీసీ కులగణన చేయిస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. తెలుగుదేశం-జనసేన కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతుందని, జగన్ దెబ్బకు అసెంబ్లీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పరార్ అవుతున్నారని బోండా ఉమ పేర్కొన్నారు.

TDP_Leaders_Fired_on_Jagan_Government
TDP_Leaders_Fired_on_Jagan_Government
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 4:41 PM IST

TDP Leaders Fired on Jagan Government: జగన్ సర్కార్ గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో అవలంబించిన తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వ్యాఖ్యలు చేశారు. హై కరెప్షన్, హై ఇన్‌ప్లేషన్, హై అన్​ఎంప్లాయ్‌మెంట్, సిస్టమ్స్ కొలాప్స్ అనే విధ్వంసకర ఆర్థిక విధానాలతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఎన్నికల ముంగిట వెనుకబడిన వర్గాలను వంచించడానికే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతో బీసీ కులగణన చేయిస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్ధిక దుస్థితిపై అసెంబ్లీ సాక్షిగా చేదు నిజాలను దాచిపెట్టి రాష్ట్ర ప్రజలను మసిపూసి మారేడు కాయ చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని యనమల దుయ్యబట్టారు. గురువారం జాతీయ మీడియాలో వచ్చిన సర్వే దెబ్బకి వైసీపీ ఖేల్ ఖతం దుకాణం బంద్ అయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఎద్దేవా చేశారు.

Kollu Ravindra: వాలంటీర్లు చేస్తున్న బీసీ కులగణనకు విశ్వసనీయత, చట్టబద్ధత ఉంటుందని జగన్ చెప్పగలడా అని రవీంద్ర నిలదీశారు. బీసీలను మరోసారి వంచించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికే హడావుడిగా కేంద్రంతో సంప్రదించకుండా జగన్ కులగణనకు శ్రీకారం చుట్టాడని మండిపడ్డారు. బీసీలకు రాజ్యాంగపరంగా స్థానిక సంస్థల్లో దక్కాల్సిన 16వేలకు పైగా పదవులు దక్కుండా చేసిన జగన్ కులగణనతో వెనుకవడిన వర్గాలను ఉద్ధరిస్తాడా అని రవీంద్ర ప్రశ్నించారు.

చంద్రబాబు బీసీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేసిన పెద్దమనిషి కులగణనతో వారిని ఆదుకుంటాడా అని ఆక్షేపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపారని కొల్లు గుర్తుచేశారు. బీసీలకు ప్రత్యేక సబ్​ప్లాన్ ఏర్పాటు చేసి, మొత్తం బడ్జెట్లో 26శాతం నిధులు బీసీల సంక్షేమానికి వెచ్చించాలని కోరారని తేల్చిచెప్పారు. బీసీ కమిషన్​కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరామన్నారు. చంద్రబాబు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఒక్కసారి కూడా కేంద్రప్రభుత్వంతో ఎందుకు మాట్లాడలేదని రవీంద్ర ప్రశ్నించారు.

జగన్ ప్రభుత్వంలో బీసీలపై అఘాయిత్యాలు పెరిగాయి: కొల్లు రవీంద్ర

Yanamala Rama Krishnudu: జగన్ రెడ్డి పాలనలో బడ్జెట్ కేటాయింపులకు విలువ లేదన్నారు. 2022-23 ఏడాది రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఆర్​బీఐ నుంచి తెచ్చిన తాత్కాలిక అప్పులతోనే నడిపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలో 365 రోజుల్లో 24 రోజులు తప్ప మొత్తం ఏడాది చేబదుళ్లతోనే గడిచిందని యనమల ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి చెప్పకుండా తెచ్చిన 5 లక్షల కోట్ల రూపాయల రుణాలు, ఆర్​బీఐ నుంచి తీసుకున్న తాత్కాలిక అప్పులు 1లక్ష 18వేల 39 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021-22లో 11 లక్షల 22వేల 837 కోట్లు ఉండగా 2022-23 లో 13 లక్షల 17వేల 728 కోట్లకు పెరిగిందని తప్పుడు లెక్కలు చూపారని ఆక్షేపించారు. ఖర్చు చేయకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎలా పెరుగుతుందని యనమల ప్రశ్నించారు. జగన్ పాలనలో పేదలు మరింత పేదలయ్యారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.

'గత ఆరు నెలల్లో రాష్ట్రంలో హింసాత్మక పాలన'

Bonda Uma: జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అమిత్ షా భేటితో వైసీపీ గజగజ వణికి పోతుందన్నారు. జగన్ అర్ధరాత్రి వరకు ఎదురు చూసినా అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని బోండా పేర్కొన్నారు. జగన్ దెబ్బకు అసెంబ్లీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పరార్ అవుతున్నారన్నారు.

జగన్ మోసం చేశారు- బొండా ఉమా

TDP MLA Satya Prasad: సీఎం జగన్ రెడ్డి కులపిచ్చి పరాకాష్టకు చేరిందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు, బలిజలని జగన్ రెడ్డి రాజకీయంగా అణిచి వేస్తున్నారని దుయ్యబట్టారు. మూడు రాజ్యసభ సీట్లలో రెండు సొంత వర్గానికి కేటాయించడమేనా జగన్ చెబుతున్న సామాజిక న్యాయం అని సత్యప్రసాద్ నిలదీశారు. బడుగు, బలహీన వర్గాలంటే జగన్ రెడ్డికి ముందు నుంచి చిన్నచూపు అని ఆగ్రహం వ్యక్తం చేశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.