ETV Bharat / state

కాకాణికి రేవ్ పార్టీతో సంబంధం లేకుంటే ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎందుకు దొరికింది: సోమిరెడ్డి - BANGALORE RAVE PARTY - BANGALORE RAVE PARTY

Somireddy Chandramohan Reddy on Kakani Govardhan Reddy MLA Sticker: అంతర్రాష్ట్ర ముఠాలతో కలసి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కాకాణి వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోరారు. బెంగళూరు రేవ్‌పార్టీతో సంబంధం లేదని కాకాణి చెబుతున్నా ఆయన పాస్‌పోర్ట్‌, ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎందుకు దొరికాయని ప్రశ్నించారు.

Somireddy Chandramohan Reddy on Kakani Govardhan Reddy MLA Sticker
Somireddy Chandramohan Reddy on Kakani Govardhan Reddy MLA Sticker (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 3:05 PM IST

Somireddy Chandramohan Reddy on Kakani Govardhan Reddy MLA Sticker : బెంగళూరు శివారులోని జీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన రేవ్‌ పార్టీ (Rave Party)పై నగర నేర నియంత్రణ దళం పోలీసులు సోమవారం తెల్లవారుజామున దాడి చేసి ఐదుగురు నిర్వాహకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి హాజరైన వారిలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నారని నిర్ధారించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Kakani Govardhan Reddy MLA Sticker in Bangalore Rave Party : ఈ తనిఖీల్లో బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 100 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్‌, కొకైన్‌తో పాటు మెర్సిడెస్ బెంజ్‌, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సీజ్‌ చేసిన ఓ కారుపై రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy) పేరుతో 'ఎమ్మెల్యే స్టిక్కర్‌' అతికించి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అనేక అనుమానాలను ప్రతిపక్షాలు వినిపిస్తున్నాయి. ఈ వ్వవహారంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

కాకాణికి రేవ్ పార్టీతో సంబంధం లేకుంటే ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎందుకు దొరికింది: సోమిరెడ్డి (ETV Bharat)

బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసుల దాడి - తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు గుర్తింపు - CCB Raids Rave party

కాకాణి అవినీతిపై పుస్తకమే రాయొచ్చు : బెంగళూరు రేవ్‌పార్టీతో సంబంధం లేదని కాకాణి చెబుతున్నారని ఆయన పాస్‌పోర్ట్‌, ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎందుకు దొరికాయని సోమిరెడ్డి ప్రశ్నించారు. రేవ్‌పార్టీ జరిగిన ఫాంహౌస్‌ యజమాని గోపాల్‌రెడ్డి కాకాణికి మిత్రుడని తెలిపారు. నకిలీ పత్రాలు, నకిలీ మద్యం తయారీతోనూ కాకాణికి సంబంధాలు ఉన్నాయని చెప్తూ అవినీతిపై ఒక పెద్ద పుస్తకమే రాయవచ్చని ఎద్దేవా చేశారు. కాకాణికి సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలున్నాయని, అంతర్రాష్ట్ర ముఠాలతో కలసి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కాకాణి వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోరారు.

కాకాణి నకిలీ మద్యంతో ప్రజలను చంపేందుకు చూస్తున్నారు : టీటీపీ నేత సోమిరెడ్డి - Somireddy Comment

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.