TDP Leader Buchi Ram Prasad Comments: ధర్మారెడ్డి ధర్మవిరుద్ధంగా జగన్ రెడ్డి కోసం, అవినాశ్ రెడ్డి కోసం పనిచేస్తున్నారని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు నుంచి కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని తప్పించడానికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి దిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసిన విషయం నిజం కాదా? అని బుచ్చిరాంప్రసాద్ ప్రశ్నించారు. అవినాశ్ రెడ్డిని హత్యకేసు నుంచి రక్షించాలని ఏకంగా కేంద్ర హోం శాఖ కార్యదర్శిని సునీతారెడ్డితో మాట్లాడించింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
గతంలో తనపై నమోదైన కేసుల వివరాల్ని టీటీడీ ఈవోగా నియమితులైనప్పుడు ధర్మారెడ్డి దాచింది నిజంకాదా? అని నిలదీశారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డిలతో కలిసి తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా ధర్మారెడ్డి వ్యవహరించారని ధ్వజమెత్తారు. వైవీసుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డితో కలిసి టీటీడీని సర్వనాశనం చేయడం నిజం కాదా? అని మండిపడ్డారు.
కాక రేపుతున్న టీటీడీ వివాదం - ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు తొలగింపు
దిల్లీ కంటోన్మెంట్‌లో ఆయన పనిచేసినప్పుడు 14 కేసులు నమోదవ్వడం వాస్తవం కాదా అని, ఓ హైకోర్టు న్యాయమూర్తికి 2 కోట్ల రూపాయల విలువైన చేతి గడియారం బహుమతిగా ఇవ్వజూపితే ఆయన ఆగ్రహం వ్యక్తం చేయలేదా? అని విమర్శించారు. పవిత్రమైన దేవస్థానంలో విధులు నిర్వహిస్తూ దిల్లీలో సీఎం జగన్ కోసం లాబీయింగ్ చేయడం నిజం కాదా? అంటూ బుచ్చిరాంప్రసార్ ప్రశ్నించారు. అదే విధంగా టీటీడీలో జరిగిన డాలర్ల కుంభకోణంలో ధర్మారెడ్డి దగ్గర ఉన్న పీఏ ఆత్మహత్య చేసుకున్న విషయం నిజమా? కాదా? అని ప్రశ్నించారు.
తనపై వచ్చిన ఆరోపణలు నిజమో కావో ధర్మారెడ్డి ప్రజల ముందుకొచ్చి చెప్పాలని బుచ్చిరాంప్రసాద్ డిమాండ్ చేశారు. అదే విధంగా తిరుమలలో జరుగుతున్న అపచారాలపై టీటీడీ మాజీ గౌరవ ప్రధానార్చకుడు రమణదీక్షితులు నోరు విప్పాలని, వాస్తవాల్ని ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఇప్పటికైనా టీటీడీలో జరుగుతున్న వాటిని నిర్భయంగా బయటకు వచ్చి చెప్పాలని అన్నారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వివాదాలు - ఆజ్యం పోస్తున్న బోర్డు
"ధర్మారెడ్డి ఒక్కసారి ఆలోచించండి. దేవుడి దగ్గర ఉంటూ, పవిత్రమైన స్థానంలో ఉంటూ మీరు చేయాల్సిన పనులు ఏంటి, చేస్తున్న పనులు ఏంటి? వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడటంలో మీ పాత్ర ఉందని అందరికీ తెలుసు. ఇక టీటీడీని అడ్డంపెట్టుకుని దిల్లీలో లాబీయింగ్, రకరకాలు కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చేసే పనులన్నీ ప్రజలు చూస్తున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని బయటకు తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేశారా లేదా? సీబీఐకి ఇచ్చిన వాగ్మూలంలో అది సునీత రెడ్డి చెప్పిన మాట వాస్తవమా కాదా? ఒక్క సారి మీరు చెప్పండి". - బుచ్చి రాంప్రసాద్, టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్