Praja Galam Sabha Live Updates
- రాష్ట్రంలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ వేర్వేరు కాదు
- రెండు పార్టీలనూ ఒకే కుటుంబం నడుపుతోంది
- ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది
- జగన్ పార్టీ మీద వ్యతిరేకతను కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు
- రెండు పార్టీల ఈ పన్నాగాన్ని గుర్తించి ఎన్డీఏకే అందరూ ఓటేయాలి
- వచ్చే ఐదేళ్లు డబుల్ ఇంజిన్ సర్కారుకే అవకాశం ఇవ్వండి
- ఆంధ్రప్రదేశ‌్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు
- ఓడరేవుల ఆధారిత అభివృద్ధికి ముందడుగు పడుతుంది
- ఏపీలోని నీలి విప్లవానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది
- రాష్ట్రంలోని మహిళలకు, యువతకు కొత్త అవకాశాలు సృష్టించేందుకు ప్రణాళికలు ఏర్పడతాయి
- పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాం
- ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా వెండి నాణెం విడుదల చేశాం
- ఈ రాష్ట్రంలోని మంత్రులు అవినీతి, అక్రమాల్లో పరస్పరం పోటీపడుతున్నారు
- ఈ రాష్ట్ర మంత్రులు ఒకరిని మించి ఒకరు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు
- రాష్ట్ర ప్రజలు రెండు సంకల్పాలు తీసుకున్నారని భావిస్తున్నాం
- ఒకటి.. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడోసారి ఏర్పాటు చేయడం
- రెండు.. ఈ రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడటం
- ఈ రెండు సంకల్పాలను మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఓటు వేయాలి
- ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారు: మోదీ
- ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలనేది మా లక్ష్యం: మోదీ
- తిరుపతిలో ఐఐటీ, ఐసర్ నిర్మించాం: ప్రధాని మోదీ
- విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశాం: మోదీ
- మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించాం: ప్రధాని మోదీ
- విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం: మోదీ
- ఆంధ్రప్రదేశ్ యువత కోసం అనేక జాతీయ విద్యాసంస్థలు స్థాపించాం
- యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించాం
- ఎన్డీఏ అంటే పేదల గురించి ఆలోచించేది.. పేదల కోసం పనిచేసేది..
- పీఎం ఆవాస్ యోజన కింద ఏపీకి 10 లక్షల గృహాలు ఇచ్చాం
- పల్నాడు జిల్లాలో 5 వేల గృహాలు ఇచ్చాం
- జలజీవన్ మిషన్ కింద కోటి గృహాలకు ఇంటింటికీ నీరు ఇచ్చాం
- ఆయుష్మాన్ భారత్ కింద కోటీ 25 లక్షల మందికి లబ్ధి
- కిసాన్ సమ్మాన్ నిధి కింద పల్నాడు ప్రజలకు రూ.700 కోట్లు అందించాం
- ఎన్డీఏలో ఉన్న ప్రతి సభ్యుడూ ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటారు
- జూన్ 4న వచ్చే ఫలితాల్లో మాకు 400 సీట్లు దాటతాయి
- దేశంలో ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు దాటాలి..
- ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలి
- ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన ప్రధాని మోదీ
- నా ఆంధ్ర కుటుంబసభ్యులు అందరికీ నమస్కారం: మోదీ
- నిన్ననే దేశంలో ఎన్నికల శంఖారావం మోగింది: మోదీ
- ఎన్నికల శంఖారావం మోగాక నా తొలి సభ ఇదే: ప్రధాని మోదీ
- గెలుపు ఎన్డీఏదే.. ఎవరికీ అనుమానం లేదు..: చంద్రబాబు
- మోదీకి అండగా ఉంటామని చెప్పేందుకే మీరంతా తరలివచ్చారు: చంద్రబాబు
- ప్రగతివాది.. మోదీకి స్వాగతం.. సుస్వాగతం..: చంద్రబాబు
- ప్రజాగళం సభ.. రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ..: చంద్రబాబు
- ఐదేళ్లుగా విధ్వంస, అహంకార పాలన చూశాం: చంద్రబాబు
- ప్రజల గుండెచప్పుడు బలంగా వినిపించేందుకే మూడు పార్టీలు కలిశాయి: చంద్రబాబు
- మీరు ఇచ్చిన తీర్పే మీ జీవితాలను నిర్ణయిస్తుంది: చంద్రబాబు
- మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా: చంద్రబాబు
- సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే మా నినాదం: చంద్రబాబు
- మోదీ ఒక వ్యక్తి కాదు.. భారత్‌ను విశ్వగురుగా మారుస్తున్న శక్తి: చంద్రబాబు
- మోదీ అంటే సంక్షేమం.. మోదీ అంటే అభివృద్ధి: చంద్రబాబు
- మోదీ అంటే భవిష్యత్తు.. మోదీ అంటే ఆత్మవిశ్వాసం: చంద్రబాబు
- సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి.. మోదీ: చంద్రబాబు
- అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి.. మోదీ: చంద్రబాబు
- సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్.. మోదీ నినాదాలు: చంద్రబాబు
- ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పారిపోతున్నాయి: పవన్
- అమరరాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇక్కణ్నుంచి వెళ్లిపోయాయి: పవన్
- జగన్‌ను రావణుడితో పోల్చిన పవన్ కల్యాణ్
- రావణ సంహారం జరుగుతుంది..: పవన్ కల్యాణ్
- రామరాజ్య స్థాపన జరుగుతుంది: పవన్ కల్యాణ్
- డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ అనుకుంటున్నారు: పవన్
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్రంలో మోదీ పాంచజన్యం పూరిస్తారు: పవన్
- లైటు స్తంభాల నుంచి దిగిపోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి
- మీ ప్రాణాలు ఎంతో విలువైనవి: ప్రధాని మోదీ
- కరెంటు తీగలకు దూరంగా ఉండాలని కోరుతున్నాం: మోదీ
- ప్రమాదాలు మాకు చాలా బాధ కలిగిస్తాయి: మోదీ
- ఎన్డీఏ కలయిక.. ఐదుకోట్ల మంది ప్రజలకు ఆనందం..: పవన్
- అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకు మోదీ వచ్చారు: పవన్
- అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది: పవన్ కల్యాణ్
- ఐదుకోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకు మోదీ వచ్చారు: పవన్
- రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం: పవన్ కల్యాణ్
- దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: పవన్
- ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారి: పవన్ కల్యాణ్
- ప్రజాగళం సభావేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్
- హెలీప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలికిన లోకేష్
- కాసేపట్లో సభావేదిక పైకి చేరుకోనున్న ప్రధాని మోదీ
- సభావేదిక పైకి చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
- ఈ ఎన్నికల్లో జగన్‌కు గుణపాఠం నేర్పాలి: భాజపా నేత సత్యకుమార్
- ఈ సభ గొడ్డలివేటు వేసినవారికి గుండెపోటు తెప్పించాలి: సత్యకుమార్
- జగన్ ఐదేళ్లలో ఒక్క బీసీకి కూడా న్యాయం చేయలేదు: జనసేన నేత గాదె
- బీసీ సంక్షేమాన్ని జగన్ నాశనం చేశారు: గాదె వెంకటేశ్వరరావు
- జగన్ మోసపు మాటలను బీసీలు నమ్మవద్దు: గాదె వెంకటేశ్వరరావు
- రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది: సోము వీర్రాజు
- వైకాపా పరిపాలన.. ఎటుచూసినా అవినీతిమయం: సోము వీర్రాజు
- ప్రజాగళం సభ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తుంది: సోము వీర్రాజు
- వైకాపా పాలనలో ఐదేళ్లుగా రాష్ట్రం చాలా నష్టపోయింది: సోము వీర్రాజు
- ఏపీ రాజధాని అమరావతే.. ఎన్డీఏ వల్లే అది సాధ్యం..: సోము వీర్రాజు
- జనజాతరను తలపిస్తున్న బొప్పూడి సభా ప్రాంగణం
- గంట వ్యవధిలోనే నిండిపోయిన 300ఎకరాల సభాప్రాంగణం
- అభిమాన నేతల రాకతో నినాదాలతో హోరెత్తిస్తున్న కార్యకర్తలు
- గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ
- ప్రధాని మోదీకి స్వాగతం పలికిన మూడు పార్టీల ప్రతినిధులు
- గన్నవరం నుంచి బొప్పూడి సభకు బయలుదేరిన ప్రధాని మోదీ
- బొప్పూడి వద్ద పార్కింగ్ ప్రాంతాల్లోకి వాహనాలు మళ్లించడంలో పోలీసుల వైఫల్యం
- జాతీయ రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు
- సభావేదిక వద్దకు చేరుకునేందుకు కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు
- ప్రజాగళం సభకు వచ్చే వారికి పోలీసులు సహకరించాలి: ప్రత్తిపాటి
- ప్రజాగళం సభకు వచ్చే ప్రజలను పోలీసులు అడ్డుకోవద్దు: ప్రత్తిపాటి
- ఆంక్షల పేరుతో ప్రజలను గ్యాలరీల్లోకి రాకుండా అడ్డుకోవద్దు: ప్రత్తిపాటి
తెలుగుదేశం నుంచి ప్రధాన స్టేజీ ఎక్కనున్న నేతలు: చంద్రబాబు, బాలకృష్ణ, యనమల, అయ్యన్న, అశోక్ గజపతిరాజు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, షరీఫ్, రామానాయుడు, తంగిరాల సౌమ్య ,నక్కా ఆనంద్ బాబు, అనగాని, సత్యప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, లావు కృష్ణ దేవారాయులు. నాయకులు శ్రేణులతో కలిసి గ్యాలరీలోనే కూర్చోవాలని నారా లోకేశ్ నిర్ణయించుకున్నారు.
బీజేపీ నుంచి ప్రధాన స్టేజీ ఎక్కనున్న నేతలు: పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సుధాకర్ బాబు, జీవీఎల్ తదితరులు
జనసేన నుంచి ప్రధాన స్టేజీ మీదకు వెళ్లనున్న అతిధులు: పవన్ కళ్యాణ్, మనోహర్, నాగబాబు, శివశంకర్, కొణతాల రామకృష్ణ, గాదె వెంకటేశ్వరరావు, బొమ్మిడి నాయకర్, కందుల దుర్గేష్, లోకం మాధవి
- బొప్పూడి ప్రజాగళం సభా ప్రాంగణానికి చేరుకున్న లోకేష్, బాలకృష్ణ
- బొప్పూడి చేరుకున్న మాజీ సీఎం, భాజపా నేత కిరణ్‌కుమార్ రెడ్డి
- ఎన్డీఏకు ఏపీ ప్రజల ఆశీస్సులు కావాలి: ప్రధాని మోదీ
- ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాం: ప్రధాని మోదీ
- ఏపీని అభివృద్ధి బాటలో పరుగులు తీయిస్తాం: ప్రధాని మోదీ
- హెలికాప్టర్‌లో బొప్పూడి సభా ప్రాంగణానికి చేరుకున్న పవన్, నాగబాబు
- బొప్పూడి ప్రజాగళం సభా ప్రాంగణానికి చేరుకున్న పురందేశ్వరి
- బొప్పూడి చేరుకున్న మాజీ సీఎం, భాజపా నేత కిరణ్‌కుమార్ రెడ్డి
- కాసేపట్లో బొప్పూడి ప్రజాగళం సభావేదిక వద్దకు రానున్న చంద్రబాబు
- రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు
- సభకు వచ్చే మార్గంలో భోజనం, తాగునీటి వసతి కల్పించిన నిర్వాహకులు
- విజయవాడ, గుంటూరు, ఒంగోలు నుంచి వస్తున్న వేలాది వాహనాలు
- ఆర్టీసి పూర్తిస్థాయిలో బస్సులు ఇవ్వకపోవడంతో అందుబాటులో ఉన్న వాహనాల్లో స్వచ్చందంగా తరలివస్తున్న ప్రజలు.
- నేడు చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద 'ప్రజాగళం' సభ
- ఎన్నికలకు యుద్ధభేరి మోగించనున్న తెదేపా, జనసేన, భాజపా
- సభకు హాజరుకానున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్
- మూడు పార్టీల మధ్య పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల సభ
- సభకు 10 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా
- కూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును వివరించనున్న పార్టీలు
- సాయంత్రం 5.20 గంటలకు సభా ప్రాంగణానికి ప్రధాని మోదీ
- ప్రధాని సభకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
- సభా ప్రాంగణాన్ని అధీనంలోకి తీసుకున్న ఎన్‌ఎస్‌జీ సిబ్బంది
- బందోబస్తు విధుల్లో 5వేల మందికిపైగా పోలీసులు
- ప్రధాని, చంద్రబాబు, పవన్ తదితర నేతల కోసం 7 హెలిప్యాడ్లు ఏర్పాటు
- చిలకలూరిపేట సభకు 300 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు
- ప్రధాని సహా ముఖ్యనేతలకు ప్రజాగళం ప్రధాన వేదిక
- ప్రధాన వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్‌తో పాటు మరో 27 మంది
- సాంస్కృతిక కార్యక్రమాలకు మరో వేదిక ఏర్పాటు
- సభలో కార్యకర్తలు, ప్రజలు కూర్చునేందుకు 24 గ్యాలరీలు ఏర్పాటు
వాహనాల దారి మళ్లీంపు: ప్రజాగళం సభ జరుగనున్న నేపథ్యంలో 16 వ నెంబరు జాతీయరహదరిపై భారీ వాహనాలను దారిమల్లించారు. బొప్పుడి వద్ద సభ జరుగుతుండటంతో గుంటూరు నుండి ఒంగోలు వైపు వెళ్లే వాహనాలను చిలకలూరిపేట నుండి నరసరావుపేట వైపు బైపాస్కు మళ్లీంచారు కేవలం ప్రజగళం సభకు వెళ్లే వాహనాలను మాత్రం అనుమతిస్తున్నారు.
బైకులు, కార్లతో ర్యాలీగా తరలి వస్తున్న కార్యకర్తలు: ఉమ్మడి గుంటూరు జిల్లా నలుమూలల నుంచి బొప్పూడికి బైకులు, కార్లతో కార్యకర్తలు ర్యాలీగా తరలి వస్తున్నారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ సభకు హాజరవుతున్న నేపథ్యంలో టీడీపీ-జనసేన-భాజపా కూటమిలో ఉత్సాహం రెండింతలైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, కోవెలమూడి రవీంద్ర తదితర నేతలు భారీ ర్యాలీగా బొప్పూడికి బయలు దేరారు.. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి సభకు బయలుదేరారు.