ETV Bharat / state

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తగ్గించేందుకు వైసీపీ కుట్రలు- వినియోగంపై శిక్షణ ఇవ్వండి: టీడీపీ - Varla Ramaiah writes to EC - VARLA RAMAIAH WRITES TO EC

Varla Ramaiah writes to EC: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వాడేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి లేఖ రాశారు. శిక్షణ ఇవ్వకపోతే పోస్టల్ బ్యాలెట్‌ను సరిగా వినియోగించలేరని పేర్కొన్నారు. 2019లో దాదాపు 56,545 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లలేదని గుర్తు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఎలా నింపాలో తెలియకే ఆ ఓట్లు చెల్లలేదని వర్ల పేర్కొన్నారు.

Varla Ramaiah writes to EC
Varla Ramaiah writes to EC
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 7:53 PM IST

Varla Ramaiah writes to EC: ఎన్నికల విధుల్లోని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు తప్పనిసరిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలంటూ, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఈసీకి లేఖ రాశారు. పోలీసులు, డ్రైవర్లు, కండక్టర్స్, క్లీనింగ్ పర్సనల్స్ లాంటి ఓపీఓలకు శిక్షణ ఇవ్వకపోతే వారు పోస్టల్ బ్యాలెట్ ను సరిగా వినియోగించుకోలేరని లేఖలో ప్రస్తావించారు.

ఓట్లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం: పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై ఓపీఓలకు శిక్షణ ఇవ్వాలని వర్ల రామయ్య ఈసీకి విజ్ఞప్తి చేశారు. 2019 సాధారణ ఎన్నికల లెక్కల ప్రకారం దాదాపు 56,545 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్కరించబడ్డాయని గుర్తు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఎలా నింపాలో తెలియకే ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. ఎన్నికల విధుల్లోని ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై సమగ్ర శిక్షణ ఇచ్చి ఓట్ల తిరస్కరణలు తగ్గించాలని కోరారు.

వారంతా ఎన్నికల విధుల్లో పాల్గొంటారు: ప్రతి నియోజకవర్గానికి దాదాపు 50 బస్సులు, 50 జీపులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయని వర్ల తెలిపారు. రాష్ట్రం మొత్తం దాదాపు 18,000 వాహనాలు ఎన్నికల విధుల్లో నిర్వహించబోతున్నాయన్నారు. ఎన్నికల విధులు నిర్వహించబోతున్న డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు, ఐటీ ఉద్యోగులను ముందుగా గుర్తించాలని సూచించారు. వారికి ఫామ్-12 తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని వర్ల పేర్కొన్నారు. ఓపీఓలు ఫామ్-12 ను ఎవరికి సమర్పించాలనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తిచేయాలని వర్ల రామయ్య ఈసీని లేఖలో కోరారు.

గులకరాయి దాడి జగన్నాటకమే!: వర్ల రామయ్య - stone attack incident

వైసీపీకి అనుకూలంగా: వైసీపీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు, పోస్టల్ బ్యాలెట్ ను తగ్గించేందుకు వైసీపీ కుట్ర పనుతుందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. ఎలక్షన్ కమిషన్ సర్క్యూలర్ ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘాలకు ఇంకా అందలేదని మండిపడ్డారు. ఆదేశాల్లేవంటూ ఫారం12 లను అధికారులు తీసుకోమంటున్నారని గుర్తుచేశారు. వైసీపీకి అనుకూలంగా కొంతమంది అధికారులు, ఉద్యోగస్తులకు అకనాలెడ్జ్ మెంట్ ఇవ్వడం లేదని అశోక్ బాబు మండిపడ్డారు.

నోడల్ ఆఫీసర్లు ఎవరూ: ఉద్యోగులను కన్ఫ్యూజన్ లో పడేస్తూ, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తగ్గించేందుకు కుట్ర అని ఎమ్మెల్సీ అశోక్ బాబు దుయ్యబట్టారు. నోడల్ ఆఫీసర్లు ఎవరో ఇంకా స్పష్టత లేని వైనం పై అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫారమ్ 12ను ఉద్యోగస్తుల నుండి తీసుకోవాల్సిన బాధ్యత ఏఆర్వో, ఆర్వోలదేనని తేల్చిచెప్పారు. ఉద్యోగస్తులు ఫారం 12 ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎకనాలడ్జ్ మెంట్ తీసుకోవాలని సూచించారు. ఉద్యోగస్తులకు అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

బొండా ఉమ అక్రమ అరెస్టుకు విజయవాడ సీపీ కుట్ర పన్నారు - ఈసీకి వర్ల రామయ్య లేఖ - Varla Ramaiah Letter to EC

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.