ETV Bharat / state

పరవాడ సినర్జిన్ ప్రమాద ఘటన - మూడుకు చేరిన మృతుల సంఖ్య - Parawada Pharma City Accident

Parawada Pharma City Accident : పరవాడ సినర్జిన్‌ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఇవాళ తెల్లవారుజామున కెమిస్ట్ సూర్యనారాయణ మృతిచెందారు. ఇప్పటికే ఈ ఘటనలో ఇద్దరు మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Parawada Pharma City Accident
Parawada Pharma City Accident (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 9:24 AM IST

Updated : Aug 26, 2024, 2:28 PM IST

Synergene Active Incident Updates : అనకాపల్లి జిల్లా పరవాడ సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ యూనిట్‌-3లో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది. ఇవాళ తెల్లవారుజామున విశాఖలోని ఇండస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ మరణించారు. ఆయన మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు.

రూ.కోటి చెక్కును అందించిన యాజమాన్యం : అక్కడ సూర్యనారాయణ మృతదేహానికి శవపరీక్ష పూర్తి, కుటుంబానికి అప్పగించారు. ఈ క్రమంలోనే మార్చురీ వద్ద మృతుడి కుటుంబానికి యాజమాన్యం రూ.కోటి చెక్కును అందించింది. అదేవిధంగా అతని స్వస్థలం విజయనగరం జిల్లాకు మృతదేహం తరలింపునకు ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఇప్పటికే ఇదే ప్రమాదంలో గాయపడిన ఝార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్‌ పూరి, రొయా అంగిరియా మృతి చెందారు. అదే రాష్ట్రానికి చెందిన ఓయబోం కొర్హకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Minister Anitha on Parawada Accident : సినర్జిన్‌ కంపెనీ బాధితులకు పరిహారం ఇస్తున్నట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతిచెందిన ముగ్గురి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. విశాఖలో జరిగిన రెండు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖకు వచ్చి బాధితులను పరామర్శించి భరోసా కల్పించారని గుర్తు చేశారు. ఆ రెండు ఘటనలపై హోం మంత్రిగా తాను ఇక్కడే ఉండి పర్యవేక్షించానని అనిత వెల్లడించారు.

అసలేం జరిగిదంటే : గురువారం అర్ధరాత్రి పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రెడియంట్స్‌ సంస్థలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ బి-బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 6 కిలోలీటర్ల రియాక్టర్‌లో కెమికల్‌ నింపి ఛార్జింగ్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. మ్యాన్‌హోల్‌ నుంచి రసాయనం ఉప్పొంగి పైకప్పునకు తగిలి కార్మికులపై పడింది. ఈ క్రమంలో ఝార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్‌, కోహర్‌, రోస, విజయనగరానికి చెందిన కెమిస్ట్‌ సూర్యనారాయణకు గాయాలయ్యాయి.

అచ్యుతాపురం ఫార్మా ఘటన - ప్రమాదం వెనుక అధికారుల నిర్లక్ష్యం! - Atchutapuram SEZ Incident

ఆందోళన రేపుతున్న ఫార్మా ప్రమాదాలు - భయాందోళనల్లో కార్మికులు - Atchutapuram Pharma incident

Last Updated : Aug 26, 2024, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.