Summer Heat Waves in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఏపీలో ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఉదయం 10 గంటలు అయితే చాలు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాష్ట్రంలో వడగాల్పులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 160కి పైగా మండలాల్లో 44 డిగ్రీల కంటే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర, పలనాడు, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచన ఉన్నట్టు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు- పల్నాడు జిల్లాలో అత్యధికంగా 46.2 డిగ్రీలు - High Temperatures in AP
ఏపీలో శనివారం ఉష్ణోగ్రతలు : ఆంధ్రప్రదేశ్లో భానుడి ఉగ్రరూపానికి ఏపీలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో దేశంలోనే అత్యధికంగా 47.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా కలశపాడులో 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా మహానంది, కొయిల్ కుంట్లలో 46.7, పలనాడు జిల్లా మాచర్లలో 46.55, నెల్లూరు జిల్లా రాపూరులో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే కర్నూలు జిల్లా మంత్రాలయం 46.6 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో 44.9, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రి 44.8 డిగ్రీలు, సత్యసాయి జిల్లా ధర్మవరం 44 డిగ్రీలు, మన్యం జిల్లా సాలూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, చిత్తూరు 43.6 డిగ్రీలు, బాపట్ల, విజయనగరం, కృష్ణా జిల్లా కంకిపాడు 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు - ఈ మండలాల్లో వడగాలులు - AP TEMPERATURE
అలాగే అనకాపల్లి, కాకినాడ, శ్రీకాకుళం 41.3 డిగ్రీలు, ఏలూరు, విశాఖ, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 160కి పైగా మండలాల్లో 44 డిగ్రీల కంటే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ ప్రకటించింది. అలాగే రేపు 230 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇది ఇలా ఉంటే ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ అధికారులు వెల్లటించారు. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచన ఉన్నట్టు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీ పురం మన్యం, విశాఖ, అనకాపల్లి, పలనాడు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేసూచనలు ఉన్నట్టు తెలిపింది.
Precautions From Summer : రాష్ట్రంలో నెలకొన్న వేడి గాలుల దృష్ట్యా ప్రజలు ఎండలో బయటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో సెల్ఫోన్లకు హెచ్చరికలు పంపించాలని అధికారులు నిర్ణయించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎండ తీవ్రత వల్ల ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. అయితే మండుతున్న ఎండలకు తోడు రాష్ట్రంలో పలు చోట్ల విద్యుత్ అంతరాయం కలగటంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు.