Student Caught with Two Bullets at Gannavaram Airport: విజయవాడ నుంచి దిల్లీ వెళ్తున్న ఓ ప్రయాణికుడి నుంచి భద్రతా సిబ్బంది రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాలోని పానిపట్టుకు చెందిన ఆర్య అనే విద్యార్థి గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఎయిర్ ఇండియా విమానంలో దిల్లీ ప్రయణించేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో ఆర్య వద్ద రెండు (ఒకటి మిస్ ఫైర్, మరొకటి సాధారణ) బుల్లెట్లు లభ్యమయ్యాయి.
వెంటనే ఆర్యను విమానాశ్రయం పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం స్టేషన్లో అప్పగించారు. ఆర్య తండ్రి రూతోట్ 2008-10 మధ్య ఓ ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీగా విధులు నిర్వహించారు. రూతోట్ పని చేసిన సమయంలో లైసెన్స్ కలిగిన గన్, బుల్లెట్లు కలిగి ఉన్నాడు. గత సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఆర్య పొరపాటున బుల్లెట్లు ఉన్న బ్యాగ్‌ను రైలు మార్గం మీదుగా కళాశాలకు తీసుకొచ్చాడు. వాటిని ఈ రోజు విమాన మార్గంలో ఇంటికి వెళ్తుండగా అధికారులు గుర్తించారు. విమానాశ్రయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
బైక్‌పై ట్రైన్‌కు ఎదురెళ్లిన వ్యక్తి - ఆ తర్వాత ఏం జరిగిదంటే?
'బాస్.. డబ్బులు తీసుకుని గంజాయి ఇవ్వలేదు!' - "అరకులోయలో మలుపులు తిరిగిన కథ"