ETV Bharat / state

నేతన్నకు కరవైన చేయూత - ఆధునిక యంత్రాలతో పోటీ పడలేక ఛిద్రమైన జీవితం - Story On NATIONAL HANDLOOM DAY 2024

Story On National Handloom Day 2024 : దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎంత ముఖ్యమో, వస్త్రాన్ని అందించే నేతన్నా అంతే ముఖ్యం. మానవాళికి వస్త్రాన్ని అందించిన నేతన్న బతుకు నేడు ఆధునిక యంత్రాలతో పోటీపడలేక ఛిద్రమైంది. మువ్వన్నెల జెండా నేసిన చేనేతకు నేడు చేయూత కరువైంది. సనాతన సంప్రదాయాలు కనుమరుగవుతున్నా, ప్రభుత్వాలు పట్టించుకోకున్నా వారసత్వ వృత్తిని, కళను కాపాడుకునేందుకు చేనేత కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు.

Story On National Handloom Day 2024
Story On National Handloom Day 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 10:08 AM IST

Story On National Handloom Day 2024 : భరతమాతకి బ్రిటిష్‌వాళ్లు వేసిన దాస్యశృంఖలాలు తెంచేందుకు గాంధీ నేతృత్వంలో కోల్​కతాలో 1905 ఆగస్టు 7న విదేశీ వస్త్ర బహిష్కరణ స్వదేశీ ఉత్పత్తుల పునరుద్ధరణ ఉద్యమం చేపట్టారు. ఉద్యమం ఆరంభమైన ఆగస్టు 7ను 'జాతీయ చేనేత దినోత్సవం'గా నిర్వహించాలని 2015లో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అదేరోజున చెన్నైలో జాతీయ స్థాయి చేనేత, హస్తకళల పురస్కారాలను చేనేత కళాకారులకు ప్రదానం చేశారు.

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చేనేత వస్త్రాలు : ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు 50 మంది చేనేత హస్తకళల పురస్కారాలను పొందడం ఇక్కడి చేనేత రంగానికి దక్కిన గౌరవం. ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూదాన్‌ పోచంపల్లి, గట్టుప్పల్‌,నారాయణపురం, చండూరు, మునుగోడు, పుట్టపాక, కొయ్యలగూడెం, నారాయణపురం, సిరిపురం, వెల్లంకి గ్రామాల్లో తయారైన ఇక్కత్ వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి.

చేనేత కార్మికుల కష్టాలు : చేనేత కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటిల్లిపాదీ శ్రమించి మగ్గాలపై కళాత్మక వస్త్రాలు నేస్తున్నారు. దేశంలో వ్యవసాయం తరువాత అధిక మందికి ఉపాధి కల్పిస్తుంది చేనేత రంగమే. ప్రపంచమంతా మెచ్చిన ఈ వస్త్రాలను తయారు చేసిన వారు మాత్రం జీవితంలో వెలుగు లేదని ఆవేదన చెందుతున్నారు. కొత్త ప్రింటెట్‌ వస్త్రాలు మార్కెట్‌లోకి రావడంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నామని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

Challenges In Handloom Sector: చేనేత కార్మికులు నేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. టెస్కో కొనుగోలు చేయకపోవడంతో ప్రస్తుతం జిల్లాలో సుమారు రూ.10 కోట్ల విలువైన చేనేత వస్త్రాలు సహకార సంఘాల్లో నిల్వ ఉన్నాయి. కొందరు వ్యాపారులు పవర్‌ లూమ్‌లపై ప్రింటెడ్‌ చీరలు తయారు చేసి చేనేత వస్త్రాలుగా విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తుండడంతో కొనుగోలుదారులు ఆ చీరలకే మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని చేనేత సహకార సంఘాల నాయకులు కోరుతున్నారు.

చేనేత రంగాన్ని ఆదుకోవాలి : చేనేత రంగంలో సమస్యలు కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమగ్ర కార్యాచరణ ఊసే లేదని సహకార సంఘం సిబ్బంది చెబుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఇటీవల చేనేత మంత్రి, కమిషనర్‌లకు వినతి పత్రాలు అందజేశామని చెబుతున్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

జాతీయస్థాయిలో మెరిసిన తెలంగాణ చేనేత కళ - ఆ చీరకు నేషనల్​ అవార్డు - AWARD FOR ECO FREINDLY SAREE
చేతినిండా పని లేక - చేసిన పనికి సరైన డబ్బులు రాక - దయనీయంగా చేనేత కార్మికుల పరిస్థితి - No Work for Handloom workers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.