Stoplog Gate Successfully Set to Tungabhadra Dam : ఎట్టకేలకు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ప్రభుత్వం చెప్పినట్లుగానే తుంగభద్ర జలాశయంలో ఇంజనీరింగ్ అద్భుతం జరిగింది. దేశంలో తొలిసారిగా విరిగిన జలాశయం గేటును ప్రవాహం ఉండగానే స్టాప్ లాగ్ గేటు అమర్చిన ఘనత ఏపీ ప్రభుత్వానికి దక్కింది. మూడు రాష్ట్రాల ఉమ్మడి జలాశయంగా ఉన్న తుంగభద్ర డ్యాంలో ఈ నెల 10న ప్రవాహంలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో భారీ వరద ఉండగానే స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేశారు. 5 ఎలిమెంట్లూ అమర్చడంలో ఇంజినీర్లు విజయవంతమయ్యారు.
నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ఒక్కో ఎలిమెంటును అత్యంత సాహసంతో అమర్చి వృథాగా పోతున్న నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. ఐదు ఎలిమెంట్ల ఏర్పాటుతో జలాశయం పూర్తిగా నిండినా, 19వ గేటు నుంచి నీరు దిగువకు వెళ్లే మార్గం లేకుండా ఈ స్టాప్ లాగ్ గేటు ప్రవాహాన్ని అడ్డుకోనుంది. జలాశయ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో అత్యంత సాహసంతో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటును పూర్తి చేశారు. ఇది ఇంజినీరింగ్ అద్భుతంగా నిపుణులు చెబుతున్నారు. స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు విజయవంతంతో అధికారులు, సిబ్బంది సంబరాలు చేసుకున్నారు.
ముందడుగు - తుంగభద్ర డ్యాంలో మొదటి ఎలిమెంట్ బిగింపు విజయవంతం - TB DAM GATE ONE ELEMENT SUCCESS
అసలేెం జరిగిందంటే : కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు వరదల ధాటికి కొట్టుకుపోయింది. ఈ నెల పదో తారీఖు శనివారం రాత్రి డ్యాం గేటు చైన్ లింక్ తెగిపోవడం వల్ల 19వ గేటు కొట్టుకుపోయింది. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు వెంటనే ఆరా తీశారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి పయ్యావుల కేశవ్‌లతో మాట్లాడారు. తాత్కాలిక గేటు ఏర్పాటు చేయటంపై టీబీ డ్యాం అధికారులతో మాట్లాడి తగిన సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ను సీఎం ఆదేశించారు. డ్యాం గేట్లను పరిశీలించిన ఇరు రాష్ట్రాల నేతలు, జలాశయం మరమ్మతులకు అధికారులను ఆదేశించారు. ఎంత ఖర్చైనా వెనుకడకుండా నీటి వృథాను ఆపాలని స్పష్టం చేశారు. గేట్ల పునరుద్ధరణకు కన్నయ కుమార్ నేతృత్వంలో పని ప్రారంభంచారు.
తెలుగురాష్ట్రాల్లో ప్రశ్నార్థకంగా సాగునీటి ప్రాజెక్టుల భద్రత - Irrigation Projects Telugu States