Stomach Cancer Symptoms: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మందిని భయపెడుతున్న తీవ్రమైన ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్. దీనిలో అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి కడుపు క్యాన్సర్. దీనిని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఈ క్యాన్సర్(Cancer) ఇండియాలో చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇది ముఖ్యంగా మారిన జీవనశైలి, ఇష్టం వచ్చినట్టు తినడం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం కారణంగా ఎక్కువగా వస్తోందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నేళ్లుగా మెరుగైన రోగనిర్ధారణ పరీక్షలు, శస్త్రచికిత్స పద్ధతులు, కీమోథెరపీ సేవలు అందుబాటులోకి వచ్చినా కూడా ఏటా ఎంతో మంది దీని బారినపడి ప్రాణాలూ కోల్పోతున్నారు. కాబట్టి దీనిని ప్రారంభదశలోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ క్యాన్సర్ వచ్చిందని గుర్తించడమేలా అని ఆలోచిస్తున్నారా? మేము చెప్పే ఈ 5 లక్షణాలు కనిపిస్తే అది కడుపు క్యాన్సర్‌గా భావించొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కడుపులోని కణాల DNAలో జన్యు మార్పులు, హెలికోబాక్టర్ పైలోరీ అని పిలువబడే సాధారణ బ్యాక్టీరియా పొట్టలోకి ప్రవేశించినప్పుడు కడుపు క్యాన్సర్ వస్తుంది. ఈ బ్యాక్టీరియాను హెచ్.పైలోరీ అని కూడా పిలుస్తారు. ఇది కడుపులో మంట, అల్సర్లు, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD), పొట్టలో పుండ్లు, ఎప్స్టీన్-బార్ వైరస్ ఇన్ఫెక్షన్, హైపర్ ఎసిడిటీ వంటి వాటికి కారణమవుతుంది. బ్యాక్టీరియా మాత్రమే కాదు.. ముఖ్యంగా మనం ఎక్కువకాలం నిల్వ ఉన్న ఆహార పదార్థాలు, కూరగాయలు, ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తిన్నా కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే ఉప్పు తినడంతో కూడా ప్రమాదం ఉంటుంది. ధూమపానం, మద్యపానం, కుటుంబంలో కడుపు క్యాన్సర్ చరిత్ర వంటివి కూడా ఈ క్యాన్సర్‌కు కారణాలు కావచ్చు. అయితే గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌ను ఈ లక్షణాలతో త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అవేంటంటే..
బీ అలర్ట్ - ఈ ఆహారాలను ఎక్కువగా ఉడికిస్తున్నారా? - క్యాన్సర్ వచ్చే అవకాశం!
- ఊహించని విధంగా బరువు తగ్గడం.
- పొత్తి కడుపు ఎగువభాగంలో కడుపు నొప్పి.
- భోజనం తర్వాత తరచుగా వాంతులు కావడం.
- తరచుగా కాఫీ రంగులో రక్తంతో వాంతులు అవ్వడం.
- నలుపు రంగులో మలం రావడం.
వీటితో పాటు పచ్చకామెర్లు, ఆకలిని కోల్పోవడం, మధుమేహం ప్రారంభ దశ, ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించినా అది కడుపు క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు. కాబట్టి మీలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ కావలంటున్నారు నిపుణులు. వెంటనే సంబంధిత వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అంటున్నారు.
చికిత్స ఎలా ఉంటుందంటే.. కడుపు క్యాన్సర్ కణితిని ఆపరేషన్ చేసి తీసేయాల్సిందే. అవసరమయితే కిమో, రేడియోథెరపీ కూడా చేయకతప్పదు. అందుకే దీనిని ముందుగా గుర్తించి సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే ప్రాణానికి ప్రమాదం ఉండదంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఆహార పద్ధతులు సరిగా ఉండేలా చూసుకోవడంతో పాటు పండ్లుఎక్కువగా తీసుకోవాలి. అలాగే డైలీ వ్యాయామం చేస్తే ఈ జబ్బు వచ్చే ప్రమాదం తక్కువ అంటున్నారు నిపుణులు.
దగ్గుతున్నప్పుడు ఛాతి, భుజాల దగ్గర నొప్పిగా ఉందా? ఇది క్యాన్సర్ సంకేతం కావచ్చు!