ETV Bharat / state

విద్యావ్యవస్థలో రాష్ట్రం దూసుకెళ్తోందన్న జగన్​ - అదంతా ఉత్తిదేనని వెల్లడించిన ఫలితాలు - SSC Result Decrease in AP - SSC RESULT DECREASE IN AP

SSC Result Decrease in Andhra Pradesh : విద్యావ్యవస్థలో రాష్ట్రం దూసుకెళ్తోందన్న సీఎం జగన్ మాటలు ఉత్తయేనని నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాలతో తేలిపోయింది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మొత్తం 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినా 17 పాఠశాలల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఉత్తీర్ణత శాతం 14.43 శాతం పెరిగినా కరోనాకు ముందు 2019 ఫలితాలతో పోల్చి చూస్తే 8.19 శాతం తగ్గింది.

ssc_result_decrease_in_andhra_pradesh
ssc_result_decrease_in_andhra_pradesh
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 10:42 AM IST

SSC Result Decrease in Andhra Pradesh : పదో తరగతి పరీక్షల్లో జిల్లా పరిషత్తు, పురపాలక, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత తగ్గింది. సరాసరి ఉత్తీర్ణత 86.69 శాతంగా ఉంది. జిల్లా పరిషత్తు బడుల్లో 79.38 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర సరాసరి కంటే 7.31 శాతం ఉత్తీర్ణత తగ్గింది. పురపాలక బడుల్లో 24.58 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 25.6 శాతం మంది ఫెయిల్ అయ్యారు. రాష్ట్రంలో ప్రైవేటు తర్వాత అత్యధికంగా పరీక్షలు రాసే విద్యార్థులు జడ్పీ బడుల్లోనే ఉంటారు. ఈసారి జడ్పీ పాఠశాలల్లో 53 వేల 53 మంది ఫెయిల్ అయ్యారు. పురపాలక, ప్రభుత్వ, జడ్పీ బడుల్లో కలిపి 3 లక్షల 14 వేల 663 మంది పరీక్షలు రాస్తే వీరిలో 2 లక్షల 47 వేల 270 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 78.58 శాతం. రాష్ట్రంలో సరాసరి ఉత్తీర్ణత 86.69 శాతం కాగా పురపాలక, జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 78.58 శాతంగా ఉంది. అంటే ఇది 8.11 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. 67 వేల 393 మంది పరీక్షలు తప్పారు.

విద్యావ్యవస్థలో రాష్ట్రం దూసుకెళ్తోందన్న జగన్​ - అదంతా ఉత్తిదేనని వెల్లడించిన ఫలితాలు

ఇంటరాక్టివ్ ఫ్లాట్‌ ప్యానళ్లు ఏర్పాటు చేశాం. బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబులు ఇచ్చాం. టోఫెల్ పెట్టాం. వచ్చే ఏడాది ఐబీ సిలబస్ తీసుకొస్తున్నామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా పదో తరగతి ఫలితాల్లో పాఠశాలలు వెనుకబడే ఉంటున్నాయి. చాలా చోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపట్టకుండా ఉన్న వారినే సర్దుబాటు చేసింది. ఇది పూర్తి స్థాయిలో కాకపోవడంతో కొన్నిచోట్ల గణితం, సామాన్య శాస్త్రం, జీవశాస్త్రం లాంటి సబ్జెక్టులు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేరు. ఇలాంటి చోట పిల్లలకు నాణ్యమైన చదువు అందడం లేదు. విద్యపై 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు లేకుండా ఉత్తమ ఫలితాలు సాధించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది.

AP SSC Result 2024 : విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలను సైతం చూచిరాత పరీక్షలుగా ప్రభుత్వం మార్చేసింది. ప్రశ్నపత్రాల ముద్రణకు నిధులు లేక వాట్సప్ గ్రూపుల్లో పంపించడం, ముద్రించిన పత్రాలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సాధారణంగా మారిపోయింది. ప్రశ్నపత్రాల లీకేజీని సైతం ప్రభుత్వం సమర్థించుకునే స్థాయికి దిగజారింది. ప్రశ్నపత్రం లీక్ అయినా ఏమీ కాదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారంటే బడుల్లో పరీక్షల నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో అనుత్తీర్ణులైన వారికి రీ-అడ్మిషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినా అభ్యర్థుల నుంచి స్పందన రాలేదు. రీ-అడ్మిషన్లు తీసుకున్న వారు అన్ని సబ్జెక్టులూ రాయాలనే నిబంధన పెట్టడం, తరగతులకు హాజరు కావాలని చెప్పడంతో ఎవరూ ఆసక్తి చూపలేదు. ఫెయిల్ అయిన సబ్జెక్టులకు మాత్రమే ఫీజులు చెల్లించారు. గతంలో ఫెయిల్ అయి ప్రైవేటుగా పరీక్షలు రాసిన 71 వేల 500 మందిలో 41.08 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

599/600 - టెన్త్​ ఫలితాల్లో సత్తా చాటిన మనస్వీ - AP SSC Toppers Inspiring Stories

పదో తరగతిలో సున్నా ఫలితాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒక్కరు ఉత్తీర్ణులుకాని పాఠశాలల సంఖ్య తగ్గుతున్నా ఇంకా వాటి సంఖ్య కొనసాగుతోంది. గత ఏడాది తొమ్మిది ప్రభుత్వ బడుల్లో ఒక్కరూ పాస్ కాకపోగా ఈ ఏడాది ఒక పాఠశాలలో ఎవరూ ఉత్తీర్ణులు కాలేదు. నంద్యాల జిల్లా అత్మకూరు మండలం బైర్లూటీ చెంచుగూడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయగా ముగ్గురూ ఫెయిల్ అయ్యారు. చెంచుగూడెంలో అక్షరాస్యత తక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. కానీ, అధికారులు పట్టించుకోకపోవడంతో సున్నా ఫలితాలు వచ్చాయి. మొత్తం ఈ పాఠశాలలో నలుగురు విద్యార్థులు పదిలో ఉండగా ఒకరు పరీక్షలకే హాజరు కాలేదు. చెంచుల విద్యపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ఎలా ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మరో 3 ఎయిడెడ్ బడుల్లోనూ ఒక్కరూ పాస్ కాలేదు.

Tenth Class Results AP : రాష్ట్రంలో 2019కి ముందుతో పోలిస్తే పదో తరగతి పరీక్షల ఫలితాలు తగ్గాయి. 2019లో 94.88 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా ఈసారి 88.69 శాతం మంది పాస్ అయ్యారు. గత మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతున్నా 2019కు ముందున్న స్థాయిలో విద్యార్థులు పాస్‌ కావడం లేదు. 2015 నుంచి 2019 వరకు 91 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2020, 21 లో కొవిడ్‌ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. అందరినీ పాస్‌ చేశారు. 2022 నంచి క్రమంగా ఉత్తీర్ణత పెరుగుతున్నా 2019 ముందు కంటే పెరగలేదు.

టెన్త్​ ఫలితాల్లో 17 పాఠశాలల్లో జీరో రిజల్ట్ - రాష్ట్రవ్యాప్తంగా 86.69% ఉత్తీర్ణత - AP SSC RESULTS 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.