ETV Bharat / state

స్పీకర్ సంచలన నిర్ణయం - 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు - టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

తెలుగుదేశం, వైఎస్సార్సీపీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. గత కొంత కాలంగా ఇదే అంశంపై విచారణ చేస్తున్న స్పీకర్ తాజాగా 8 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు. తెలగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటుగా వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు.

Speaker Tammineni To Take Action on YCP TDP Rebel MLAs

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 10:54 PM IST

Updated : Feb 27, 2024, 8:58 AM IST

Speaker Tammineni to Take Action on YCP and TDP Rebel MLAs: పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ, తెలుగుదేశం ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టిన తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే అనర్హత పిటిషన్ లపై విచారణను ముగించిన స్పీకర్, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరవాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు, వైఎస్సార్సీపీ, టీడీపీలు స్పీకర్​కు పిటిషన్లు ఇచ్చాయి. వైఎస్సార్సీపీ ఇచ్చిన పిటిషన్ లో అనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవి పేర్లు ఉండగా, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ పేర్లు ఉన్నాయి. ఇరుపార్టీలకు చెందిన మెుత్తం 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాజకీయ విలువల్లో జగనన్న స్టైలే వేరు - పార్టీని వ్యతిరేకిస్తే అనర్హత వేటే!

శాసనసభలో ఈ ఎనిమిది స్థానాలూ ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ P.P.K. రామాచార్యులు ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారాన్ని పంపారు. మంగళవారం ఈ మేరకు గెజిట్‌ వెలువడనుంది. వారం పది రోజుల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ రాబోతున్న తరుణంలో వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ అభ్యర్థులుగా గెలిచి వైసీపీ పంచన చేరిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్‌, వాసుపల్లి గణేష్‌లపై అనర్హత వేటు పడింది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడడం ఇదే ప్రథమం.

'సుప్రీంతీర్పు ఫిరాయింపు చట్టాన్ని ప్రశ్నార్థకం చేసింది'

వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు నలుగురిపై శాసనసభలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ తరఫున శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత వైసీపీలో చేరిన నలుగురిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్‌ డోలా బాలవీరాంజనేయస్వామి ఫిర్యాదు చేశారు.

చెల్లి అని చూడకుండా దూషిస్తున్నారు - జగన్​పై షర్మిల ఆగ్రహం

Last Updated : Feb 27, 2024, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.