ETV Bharat / state

ప్రయాణికులకు అలర్ట్ - 11 రోజుల పాటు 78 రైళ్లు రద్దు - 26 ఎక్స్‌ప్రెస్‌ల దారి మళ్లింపు - 78 TRAINS CANCELLED IN TELANGANA

78 Trains Cancelled in Kazipet - Ballarsha Section: దక్షిణ మధ్య రైల్వేజోన్‌ పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో 78 రైళ్ల రద్దు చేయనున్నట్లు దక్షణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 26 ఎక్స్‌ప్రెస్‌ల దారి మళ్లించనున్నట్లు పేర్కొంది.

South Central Railway
South Central Railway (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 10:42 AM IST

78 Trains Cancelled in Kazipet - Ballarsha Section Details : దక్షిణ మధ్య రైల్వేజోన్‌ పరిధిలోని పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. రైల్వే పనుల కారణంగా పలు రైల్లను రద్దు చేయడమే కాకుండా, మరి కొన్ని రైళ్ల రూటునూ మార్చినట్లు దక్షణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అందులో భాగంగా కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.

ఆసిఫాబాద్‌-రేచ్ని స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణం కారణంగా వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మెుత్తం 26 ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించి నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆయా రైళ్ల వివరాలను దక్షణమధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కనిష్ఠంగా ఒక రోజు నుంచి గరిష్ఠంగా 11 రోజుల పాటు రైళ్లు రద్దు కానున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.

ఒక్క ట్రైన్ టికెట్ - 56 రోజుల వ్యాలిడిటీ - దేశం మొత్తం చుట్టేసి రావచ్చు! - Circular Journey Ticket Advantages

రద్దయిన రైళ్లు వివరాలు:

కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (నం.12757/12758) జూన్‌ 26 నుంచి జులై 6 వరకు

పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ (నం.22151) ఈ నెల 28, జులై 5న

కాజీపేట-పుణె ఎక్స్‌ప్రెస్‌ (నం.22152) జూన్‌ 30, జులై 7న

హైదరాబాద్‌-గోరఖ్‌పుర్‌ (నం.02575) జూన్‌ 28న,

గోరఖ్‌పుర్‌-హైదరాబాద్‌ (నం.02576) ఎక్స్‌ప్రెస్‌ జులై 30న

ముజఫర్‌పుర్‌-సికింద్రాబాద్‌ (నం.05293) జులై 2న,

సికింద్రాబాద్‌-ముజఫర్‌పుర్‌ (నం.05294) జూన్‌ 27, జులై 4న

గోరఖ్‌పుర్‌-జడ్చర్ల (నం.05303) రైలు జూన్‌ 29న,

జడ్చర్ల-గోరఖ్‌పుర్‌ (నం.05304) రైళ్లు జులై 1న

సికింద్రాబాద్‌-రాక్సల్‌ మధ్య తిరిగే వేర్వేరు మూడు రైళ్లు జూన్‌ 26, 27, 28 తేదీల్లో..

సికింద్రాబాద్‌-దానాపుర్‌ల మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు జూన్‌ 27, 28, 29, జులై 1 తేదీల్లో..

సికింద్రాబాద్‌-సుభేదార్‌గంజ్‌ మధ్య తిరిగే రైళ్లు జూన్‌ 27, 29 తేదీల్లో రద్దయ్యాయి.

దారి మళ్లించిన రైళ్లు : తెలంగాణ, దురంతో ఎక్స్‌ప్రెస్‌లను ఆయా తేదీల్లో దారి మళ్లించి నడిపించాలని దక్షణ మధ్య రైల్వే నిర్ణయించింది. కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్‌ - న్యూదిల్లీ (నం.12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్‌ మీదుగా మళ్లించనున్నారు. కాజీపేటతో పాటుగా రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను ప్రయాణమార్గం నుంచి తొలగించారు.

న్యూదిల్లీ - సికింద్రాబాద్‌ (నం. 12724) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 3, 4, 5 తేదీలలో ముద్కేడ్, నిజామాబాద్‌ మీదుగా నడిపించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్లను ప్రయాణమార్గం నుంచి తొలగించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌-నిజాముద్దీన్‌ (దిల్లీ), నిజాముద్దీన్‌-సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను (నం.12285/12286) జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్‌ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు.

ప్రయాణికులకు శుభవార్త - జన్మభూమి ఎక్స్​ప్రెస్ రైలు పునరుద్ధరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.