Four Killed in Slab Collapsed in Nandyal District : నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన చాగలమర్రి మండలం చిన్న వంగలిలో చోటు చేసుకుంది. రాత్రి బాగా పొద్దుపోయాక ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో భార్యాభర్తలు గురుశేఖర్ రెడ్డి (45), దస్తగిరమ్మ (38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10) మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్థులు వెలికి తీస్తున్నారు. వీరి మరో కుమార్తె ప్రసన్న పొద్దుటూరులో చదువుకుంటోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
నీతోనే నేను - మృత్యువులోనూ వీడని బంధం! వృద్ధ దంపతుల విషాద గాథ - Two old couple died in one day