ETV Bharat / state

తెలంగాణలో ఎస్సై ఆత్మహత్య కేసు - స్పందించిన సీఐ సతీమణి - SI Suicide Case in Telangana - SI SUICIDE CASE IN TELANGANA

Aswaraopet SI Sriramulu Srinu Suicide Case : సీఐ, కానిస్టేబుల్స్​ వేధిస్తున్నారని తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాములు శ్రీను పురుగుల మందు తాగి వారం రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు. ఆయన మరణానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐతో పాటు మరో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు.

SI SUICIDE CASE IN TELANGANA
SI SUICIDE CASE IN TELANGANA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 5:07 PM IST

Aswaraopet SI Sriramulu Srinu Died : తెలంగాణలో సంచలనం సృష్టించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నం ఘటన విషాదాంతమైంది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. సీఐ జితేందర్​ రెడ్డి సహా నలుగురు కానిస్టేబుల్స్​ పనిలో సహకరించకపోవడమే కాకుండా కులం పేరుతో వేధించారని ఆత్మహత్యాయత్నం అనంతరం ఎస్సై శ్రీను ఓ వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు, మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

గత నెల 30న స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లిన ఎస్సై శ్రీను ఎంతకు తిరిగి రాకపోయే సరికి అశ్వారావుపేట పోలీసులు గాలింపు చేపట్టారు. ఈలోగా ఆయనే 108కు ఫోన్​ చేసి తాను మహబూబాబాద్​లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆయన చెప్పారు. ఆ ప్రాంతానికి వెళ్లిన అంబులెన్స్​ సిబ్బంది హుటాహుటిన ఆయనను హైదరాబాద్​ తరలించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ఎస్సై శ్రీను చనిపోయారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

ఎస్సై శ్రీను ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశ్వరావుపేట సీఐ జితేందర్​ రెడ్డిని వరంగల్​ ఐజీకి, నలుగురు కానిస్టేబుల్స్​ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్​ చేశారు. తన భర్త ఆత్మహత్యకు సీఐ జితేందర్​, నలుగురు కానిస్టేబుల్స్​ కారణమని ఎస్సై శ్రీరముల శ్రీను భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఎస్సై ఆత్మహత్యాయత్నం-సీఐ పై కేసు నమోదు

CI Wife Reacts on SI Suicide Incident : ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య ఘటనలో సీఐ జితేందర్ రెడ్డితో పాటు నలుగురు కానిస్టేబుళ్లు కులం పేరుతో దూషించడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐ జితేందర్ భార్య శైలజ ఓ వీడియోను విడుదల చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను సీఐ జితేందర్‌రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నట్లు ఆమె వివరించారు. అటువంటి తన భర్త, శ్రీరాములును కులం పేరుతో వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు రావటం బాధాకరమన్నారు.

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఐ జితేందర్ రెడ్డి 2003-06 వరకు తనతో పాటు డిగ్రీ కలిసి చదువుకున్నాడని ఆమె వివరించారు. 2009లో ఎస్సైగా ఉద్యోగం సాధించిన తర్వాత పెద్దలను ఒప్పించి 2015లో ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులతో పాటు కుల సంఘాలు వారు దీన్ని గమనించి పారదర్శకంగా విచారణ చేయాలని శైలజ కోరారు. ప్రస్తుతం తనకు 6 ఏళ్ల వయసున్న కుమారుడు, నాలుగేళ్ల వయసున్న కుమార్తె ఉన్నట్లు చెప్పారు. ఎస్సై శ్రీరాములు శ్రీను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె పేర్కొన్నారు.

యూనిఫాం తీసేసి రైలు కిందపడి ఏఎస్​ఐ బలవన్మరణం - ASI suicide

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.