Shirdi Dwarkamai Old Age Home Founder Srinivas Passed Away : అనాథ వృద్ధుల కోసం శిర్డీలో 'ద్వారకామాయి' పేరిట వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న బండ్లమూడి శ్రీనివాస్ (54) అంత్యక్రియలు ముగిశాయి. విజయవాడకు చెందిన ఆయన 25 ఏళ్ల కిందట శిర్డీలో చిన్న అద్దె ఇంట్లో అనాథ వృద్ధుల కోసం ఆశ్రమాన్ని ప్రారంభించారు. అది క్రమంగా పెద్ద సంఖ్యలో వృద్ధులు చేరుతుండటంతో దాతలు సమకూర్చే విరాళాలతో శ్రీనివాస్ ఆశ్రమాన్ని విస్తరించారు.
2011-12లో జమ్మూకు చెందిన బాబా భక్తుడు ఒకరు శ్రీనివాస్ సేవలు చూసి, తన విరాళంతో రెండంతస్తుల భవనం కట్టించి ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ సుమారు 150 మంది అనాథ వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. శ్రీనివాస్ మరణంతో వృద్ధాశ్రమం శోకసంద్రంగా మారింది. శ్రీనివాస్‌కు భార్య సుధ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండు వారాల క్రితం టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారకామాయి వృద్ధాశ్రమాన్ని సందర్శించి శ్రీనివాస్ సేవలను కొనియాడారు.