TDP Suspend MLA Koneti Adimulam : తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే తనపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్‌కు పిలిపించి తనను వేధించారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వేధింపులను పెన్ కెమెరాలో రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో మెసేజ్‌లు పంపి వేధించారని బాధితురాలు లేఖలో వెల్లడించారు.
ఈ విషయాన్ని టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఇదిలావుండగా ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. బలాత్కారం, బెదిరించి అత్యాచారం చేశారని కేసు ఫైల్ చేశారు.