ETV Bharat / state

ఊపిరి పీల్చుకున్న విజయవాడ - విపత్తు వేళ ప్రభుత్వం స్పందనపై ప్రజల హర్షం - Relief Operations in Vijayawada - RELIEF OPERATIONS IN VIJAYAWADA

Relief Works in Vijayawada : బుడమేరు వరద ఉద్ధృతి తగ్గడంతో విజయవాడ ఊపిరి పీల్చుకుంటోంది. వారం రోజులుగా నీటిలో నానుతున్న కాలనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. నీటి నుంచి బయటపడిన కాలనీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. బాధితులకు ప్రభుత్వం 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది.

Relief Operations in Vijayawada
Relief Operations in Vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 11:43 AM IST

Flood Relief Programs in Vijayawada : బుడమేరుకు ప్రభుత్వం గండ్లు పూడ్చడంతో విజయవాడకు వరద ఉద్ధృతి తగ్గింది. వారం రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు కాలనీలు ఒక్కొక్కటిగా తేరుకుంటున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో కొంత మేర నీరు ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులేమీ కలగడం లేదు. నడుము లోతు నీటిలో ఉండలేక సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న వారంతా తిరిగి ఇళ్లకు వచ్చేశారు. గత నాలుగు రోజులు వరద నీటితో చాలా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు కాస్తా తగ్గడంతో ఉపిరి పీల్చుకుంటున్నామని స్థానికులు పెర్కొన్నారు.

శరవేగంగా సాగుతున్న సహాయక చర్యలు : మరోవైపు ప్రభుత్వం పారిశుద్ధ్య పనులను శరవేగంగా చేస్తోంది. రోడ్లపై పేరుకుపోయిన బురదని ఫైర్‌ ఇంజిన్లతో తొలగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు కాల్వల్లోని చెత్తని తొలగిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వీధులన్నింటీలో బ్లీచింగ్‌ చల్లుతున్నారు. బాధితులకు చికిత్స అందించేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో అనేక మంది దాతలు ముందుకొచ్చి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఆహార పొట్లాలు, తాగునీరు, పాల ప్యాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రతి ఇంటికీ 25 కేజీల బియ్యం, ఉల్లిపాయలు, మంచినూనె, కందిపప్పు వంటి నిత్యావసరాలు అందిస్తోంది. పౌరసరఫరాల శాఖ మొబైల్‌ రేషన్‌ వాహనాల ద్వారా పంపిణీ చేస్తుంది.

"మొదట రెండు రోజులు ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు వస్తువలన్ని ఇస్తున్నారు. ఆహార పదార్థాలు, పాల ప్యాకెట్లు ఇస్తున్నారు. ప్రతి ఇంటికి నిత్యావసరాలు అందుతున్నాయి. అధికారులు అడిగి మరి పంపిణీ చేస్తున్నారు విపత్తు వేళ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని చెప్పవచ్చు. వయసుని కూడా లెక్కచేయకుండా సీఎం చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారు." - బాధితులు

"వరద బాధితులందరికి రేషన్​కార్డు ద్వారా లేదా ఆధార్​కార్డు ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. ఆధార్ నంబర్ ఉన్నా వారికి వస్తువులు ఇస్తున్నాం. ఇతర జిల్లాల నుంచి కూడా మెబైల్ వాహనాలను తీసుకు వచ్చి బాధితులకు నిత్యసరాలు అందిస్తున్నాం. ప్రజలు తప్పని సరిగా నిత్యసరాలు తీసుకోవాలని సూచిస్తున్నాం." - అధికారులు

Flood Victims Thanks to AP Govt : విపత్తు వేళ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని వరద బాధితులు కొనియాడారు. వయసుని కూడా లెక్కచేయకుండా సీఎం చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి విజయవాడలోనే ఉంటూ వరద పరిస్థితిని సమీక్షిస్తూ తమను కాపాడేందుకు చాలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. తమకు ఇబ్బందులు లేకుండా అన్ని సమకురుస్తున్నారని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చ కష్టకాలంలో తమకి తోడు నిలిచిన ప్రతి ఒక్కరికీ వారు ధన్యవాదాలు తెలియజేశారు.

విజయవాడ సింగ్ నగర్​లో తగ్గుతున్న వరద - సహాయక చర్యలు వేగవంతం - Relief Work in Flood Affected Areas

శరవేగంగా పారిశుద్ధ్య పనులు - డ్రోన్ల సాయంతో బ్లీచింగ్ పిచికారి - drones for vijayawada sanitation

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.