Reasons for Brutal Murder in Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన రషీద్ హత్యలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన రషీద్, నిందితుడు జిలానీ ఇద్దరూ వైఎస్సార్సీపీ కార్యకర్తలే. రెండేళ్ల క్రితం జరిగిన ఓ గొడవలో తనపై అన్యాయంగా కేసు పెట్టి జైలుకి పంపించారని, రషీద్‌పై జిలానీ పగ పెంచుకున్నాడు. అదును చూసి నడిరోడ్డుపై కర్కశంగా నరికి చంపాడు. పోలీసులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
వినుకొండలో ప్రత్యర్థి చేతిలో దారుణంగా చనిపోయిన షేక్ రషీద్, నిందితుడు షేక్ జిలానీ ఇద్దరూ ఏడాది క్రితం వరకూ వైఎస్సార్సీపీలోనే తిరిగారు. 2022లో మొహర్రం రోజు పాత పశువుల హాస్పిటల్ సమీపంలో మద్యం తాగుతూ రెండువర్గాలు బీరు సీసాలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో జిలానీ బీరు సీసాతో ఒకరిని పొడవడంతో అతని తల, గొంతుపై గాయాలయ్యాయి. దాడి తర్వాత కొందరి ప్రోద్బలంతో జిలానీ ఇంటిపై రషీద్ దాడికి పాల్పడ్డాడు. జిలానీ సోదరుడు జానీ, కుటుంబసభ్యులను కొట్టి అక్కడే ఉన్న బుట్లెట్ బండిని తగలబెట్టారు.
పల్నాడులో యువకుడు దారుణ హత్య - సంఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ - Young Man Murder
దీనిపై జిలానీ ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలేమీ తీసుకోలేదు. కానీ అంతకుముందు బీరు సీసాతో పొడిచాడని జిలానీపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకి పంపించారు. దీంతో రషీద్‌పై జిలానీ కక్ష పెంచుకున్నాడు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎలక్షన్ సమయంలో ముస్లిం నాయకుల మధ్య జరిగిన ఘర్షణపై నమోదైన కేసుల్లో జిలానీ పేరునూ చేర్చారు. పగ పెంచుకున్న జిలానీ బుధవారం రాత్రి వినుకొండలో మద్యం దుకాణం నుంచి రషీద్ బయటకు రాగానే కొబ్బరి బొండాల కత్తితో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణంగా నరికి చంపాడు.
అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒక వ్యక్తిని దారుణంగా కత్తితో నరుకుతుంటే కొందరు కళ్లప్పగించి చూస్తుంటే మరికొందరు సెల్‌ఫోన్లో వీడియోలు తీశారు తప్ప అడ్డుకునే ప్రభుత్వం చేయలేదు. రక్తపు మడుగులో పడి ఉన్న రషీద్‌ను పది నిమిషాల తర్వాత పోలీసు జీపులో హాస్పిటల్‌కి తరలించినా ఫలితం లేకుండా పోయింది. హత్యకు పాల్పడిన జిలానీని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రషీద్ మృతదేహానికి పోస్టుమార్టం చేసి, అతని కుటుంబసభ్యులకు అప్పగించారు.
తిరుపతిలో దారుణం - దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి - వృద్ధురాలు మృతి