ETV Bharat / state

కేంద్ర బడ్జెట్​పై కాంగ్రెస్ నేతల గుస్సా - బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ - TELANGANA ASSEMBLY SESSIONS 2024 - TELANGANA ASSEMBLY SESSIONS 2024

Telangana Assembly Sessions 2024 : బడ్జెట్​ కేటాయింపుల్లో కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర వివక్ష చూపిందని కాంగ్రెస్ మంత్రులు ఆక్షేపించారు. విభజనచట్టం హామీల అమలు విషయంలో ఏపీకి న్యాయం చేశారని, తెలంగాణకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఈ కేటాయింపులపై బాధ్యత వహిస్తూ బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.

Congress fires on Union Budget 2024
Telangana Assembly Sessions 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 24, 2024, 7:00 PM IST

Updated : Jul 24, 2024, 7:23 PM IST

Congress fires on Union Budget 2024 : రాష్ట్రంలో నిర్వహిస్తున్న వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. కేంద్ర బడ్జెట్​లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ అధికారపార్టీ నేతలు దుయ్యబట్టారు. తెలంగాణపై కేంద్రానికి ఉన్న వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. విభజనచట్టం హామీల అమలు విషయంలో ఏపీకి న్యాయం చేశారని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంపై వివక్ష చూపడం దురదృష్టకరమన్నారు.

మంత్రి పొంగులేటి ఫైర్.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సింది రాలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని గుర్తించకపోవడం బాధాకరమన్నారు. కేంద్రంలోని బీజేపీ మొండిచేయి చూపితే కాంగ్రెస్‌ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పొంగులేటి డిమాండ్ చేశారు.

మొదట్నుంచి చిన్నచూపేనని మంత్రి పొన్నం ఆక్షేపణ.. కేంద్ర ప్రభుత్వం నిధులపై బీజేపీ ఎంపీలను ప్రశ్నిస్తే, ఉపాధిహామీ కింద నిధులు తెచ్చామనటం హాస్యాస్పదమని మరో మంత్రి మంత్రి పొన్నం పేర్కొన్నారు. మూసీ శుద్ధికి నిధులు అడిగితే అవినీతి కోసం అడిగినట్లా? అని ఆయన ప్రశ్నించారు. గంగ, సబర్మతి శుద్ధిని మోదీ ప్రభుత్వం చేపట్టాలేదా? అని, కమీషన్ల కోసమే చేపట్టారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేలా కేంద్ర బడ్జెట్‌ లేదన్నారు.

అఖిలపక్ష నేతలను కేంద్రం వద్దకు బీజేపీ నేతలు తీసుకెళ్తారని ఆశించామని, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే లేకుండా చేశారని మంత్రి పొన్నం ఆక్షేపించారు. తెలంగాణ అంటే మోదీకి, మొదట్నుంచి చిన్నచూపేనని, తెలంగాణ ఏర్పాటునే మోదీ ఎన్నోసార్లు అవమానించారని దుయ్యబట్టారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టారని గుర్తు చేశారు.

కేంద్రమంత్రులు కనీసం వారి నియోజకవర్గాలకు కూడా నిధులు తెచ్చుకోలేకపోయారని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. చారిత్రక నగరానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవటం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణలోని 7 మండలాలను ఆర్డినెన్స్‌ ద్వారా ఏపీలో కలిపారని, 7 మండలాలను ఏపీలో కలపటం వల్ల సీలేరు ప్రాజెక్టును కోల్పోయామన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉంటే నిధులు ఇస్తారని భావించామన్నారు.

మద్దతు ఇచ్చినా రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదు.. పదేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే వివేక్‌ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ఎన్నోసార్లు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్ని బిల్లులకు మద్దతు ఇచ్చినా, రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పోతే, కేవలం 27 పైసలు ఇస్తున్నారని మండిపడ్డారు. యూపీ మాత్రం రూపాయి చెల్లిస్తే, మళ్లీ రూ.1.72 ఇస్తున్నారని తెలిపారు.

"కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సింది రాలేదు. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని గుర్తించకపోవడం బాధకరం. కేంద్రంలోని బీజేపీ మొండిచేయి చూపితే కాంగ్రెస్‌ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయాలి. బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి". - పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మంత్రి

సీఎం రేవంత్​ VS కేటీఆర్ - అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం - telangana assembly meetings 2024

శాసనసభలో ఆర్టీసీపై వాడివేడి చర్చ - ఇంతకీ ప్రభుత్వంలో సంస్థ విలీనం ఉన్నట్టా లేనట్టా? - DEBATE ON TGRTC MERGE IN GOVT

Last Updated : Jul 24, 2024, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.