Ration Dealers Problems in Andhra Pradesh : రాష్ట్రంలో రేషన్ డీలర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వైఎస్సార్సీపీ పాలనలో రేషన్ డీలర్లు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వచ్చే సంక్షేమ కానుకలను జగన్ సర్కార్ మంగళం పాడింది. దీంతో రేషన్ డీలర్ల జీవనోపాధి కష్టతరం అయ్యిందని వాపోతున్నారు. ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా కమిషన్ పెంచలేదని రేషన్ డీలర్లు (Ration Dealers) ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి రేషన్ పంపిణీ రావడంతో ఎటువంటి ఆదాయం లేక అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తమ ఓటుతో బుద్ధి చెపుతామని రేషన్ డీలర్లు హెచ్చరిస్తున్నారు.
'రాష్ట్రంలో సుమారు 29వేల మంది రేషన్ డీలర్లు ఉన్నారు. గతంలో ప్రజలకు రేషన్ సరుకులు అందించే బాధ్యత డీలర్లకు ఉండేది. అయితే రేషన్ డీలర్ల ఆర్థిక మూలాలపై జగన్ సర్కార్ కక్ష సాధించింది. ఇంటింటికి రేషన్ పంపిణీ పేరుతో వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటినుంచి డీలర్లకు ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాకు వచ్చే కమిషన్‌లో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి పెంచలేదు.' - లీలా మాధవరావు, రాష్ట్ర రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, కందుల బాపూజీ, రేషన్ డీలర్
ap Ration dealers fires on govt: ఆ పని మేమూ చేయగలం.. సర్కారుపై రేషన్ డీలర్ల ఫైర్
Economic Problems to AP Ration Dealers : వైఎస్సార్సీపీ పాలనలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్నామని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హాయాంలో పండగ కానుకలు అందించే వాళ్లని ఈ ప్రభుత్వ వాటికి మంగళం పాడిందని వాపోయారు. కానుకల ద్వారా వచ్చే ఆదాయం (Income) ఆగిపోవడంతో చాలీచాలని వేతనాలతో తమ కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కమిషన్ సమయానికి ఇవ్వడం లేదని రేషన్ డీలర్లు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
జగన్ ఏలుబడిలో తమకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ (telangana) లో ఇచ్చినట్లు గౌరవ వేతనం చెల్లించాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.
RATION DEALERS: ఆగని రేషన్ డీలర్ల ఆందోళన.. ఈరోజు గిడ్డంగుల వద్ద నిరసనలు
రేషన్ వ్యవస్థను వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది: చంద్రబాబు